ENGLISH

కోలీవుడ్ స్టార్ హీరోతో శ్రీలీల రొమాన్స్

17 September 2024-14:29 PM

గత ఏడాది ఏ సినిమాలో చూసినా శ్రీలీలే కనిపించేది. హీరోలు, దర్శకులు , నిర్మాతలు శ్రీలీల డేట్స్ కోసం కాళ్ళు అరిగేలా తిరిగేవారు. ఇప్పుడు సీన్ మారింది. శ్రీలీల వరుస ప్లాఫ్ లతో వెనక పడిపోయింది. ఎవరూ పట్టించుకోవటం మానేశారు. చాలా మంది సీనియర్స్ కి ఈ కన్నడ బ్యూటీ  అప్పట్లో చెక్ పెట్టింది. వారి ఛాన్స్ లు కూడా శ్రీలీల ఖాతాలో పడ్డాయి. వారంతా ఎన్ని శాపాలు పెట్టారో అవన్ని ఫలించి ఇప్పుడు అరకొర ఛాన్స్ లతో నెట్టుకొస్తోంది అమ్మడు. మహేష్ తో గుంటూరు కారం, బాలయ్యతో భగవంత్ కేసరి చేసిన తరవాత ఇంకో మూవీ రాలేదు శ్రీ లీలది. ప్రస్తుతం హరీష్ శంకర్- పవన్ కళ్యాణ్ కాంబో మూవీ ఉస్తాద్ భగత్ సింగ్ లో, నితిన్ రాబిన్ హుడ్ లో, రవి తేజతో ఒక మూవీలో నటిస్తోంది. 


తెలుగులో పెద్దగా అవకాశాలు రాకపోవటంతో మిగతా భాషలు పై ద్రుష్టి పెట్టి ఆఫర్స్ దక్కించుకుంటోంది. బాలీవుడ్ లో ఇప్పటికే సైఫ్ ఆలీ ఖాన్ కొడుకు ఇబ్రహీం ఆలీతో ఒక మూవీ. సిద్దార్థ్ రాయ్ కపూర్ తో ఒక మూవీ కమిట్ అయినట్లు టాక్. ఇవి కాక కోలీవుడ్ , శాండిల్ వుడ్, మల్లు వుడ్ లో కూడా ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఈ క్రమంలోనే  కోలీవుడ్ లో ఒక క్రేజీ ఆఫర్ అందుకుందని సమాచారం. కోలీవుడ్ హీరో అజిత్ సినిమాలో శ్రీలీల సెలెక్ట్ అయినట్లు తెలుస్తోంది.  


ప్రజంట్ అజిత్  'విడా ముయార్చి', 'గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ' సినిమాలు చేస్తున్నాడు. రెండు సినిమా షూటింగ్స్ ఒకే సారి చేస్తున్నాడు అజిత్.  ఈ రెండిటిలో ఒక మూవీ కోసం శ్రీ లీలను సంప్రదించినట్లు కోలీవుడ్ మీడియా టాక్. ఇంకో వైపు శ్రీ లీల హీరోయిన్ గా కాదు ఐటెం సాంగ్ కోసం అయి ఉండొచ్ఛన్న వాదన వినిపిస్తోంది. ఏదైనా కానీ కోలీవుడ్ లో శ్రీలీల గ్రాండ్ ఎంట్రీకి సిద్దమైనట్లు తెలుస్తోంది.