ENGLISH

ఓవర్సీస్ లో దేవర మానియా

17 September 2024-14:06 PM

ఎన్టీఆర్ ‘దేవర’ సినిమా కోసం వరల్డ్ వైడ్ ఆడియన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎన్టీఆర్ నట విశ్వరూపాన్ని చూడటానికి, జాన్వీ కపూర్ గ్లామర్ మెరుపులకు ఇప్పటికే  US లో క్యూ కడుతున్నారు. రిలీజ్ కి ఇంకా 10 రోజులు ఉన్నా అప్పుడే దేవర సందడి మొదలైంది. ఎవరైనా ఇంట గెలిచి రచ్చ గెలుస్తారు. కానీ ఎన్టీఆర్ ఇందుకు భిన్నంగా మొదట ఓవర్సీస్ లో రికార్డ్ కొల్లగొట్టి, అప్పుడు ఇండియన్ రికార్డ్స్ పై దండయాత్ర చేయనున్నట్లు కనిపిస్తోంది. US లో దేవర  అడ్వాన్స్ బుకింగ్స్ స్టార్ట్ అయ్యాయి.  దేవర మానియా ఎంతలా ఉందంటే ట్రైలర్ రిలీజ్ కి ముందే అడ్వాన్స్ బుకింగ్స్ మొదలవటం గమనార్హం. అడ్వాన్స్ బుకింగ్ లో 1 మిలియన్ గ్రాస్ కలెక్షన్స్  వసూలు చేసింది. సెప్టెంబర్ 26న స్పెషల్ ప్రీమియర్స్ షో కోసం ట్రైలర్ రిలీజ్ కి ముందే 30000 టికెట్స్ బుక్ అయ్యాయి. 


రిలీజ్ కి ముందే దేవర రికార్డ్ సృష్టిస్తోంది. ట్రైలర్ రిలీజ్ కి ముందే భారీగా టికెట్స్ అమ్ముడు పోవటం ఒక ఎత్తు అయితే ప్రీమియర్ షో కోసం ఇప్పటివరకు 45000 టికెట్స్ బుక్ అయినట్టు టీమ్  అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. అంటే ఓవర్సీస్ లో 1.75 మిలియన్ డాలర్స్ సినిమా రిలీజ్ కి ముందే రాబట్టింది దేవర. ఇంకా పది రోజులు టైం ఉండటంతో ఈ సంఖ్య పెరిగే ఛాన్స్ ఉన్నట్లు ట్రేడ్ పండితుల సూచన. మొత్తంగా ఎన్టీఆర్ రికార్డ్ లు వేట మొదలు పెట్టి ఓవర్సీస్ రికార్డ్స్ కొల్లగొట్టే పనిలో ఉన్నాడు. 


ఫస్ట్ ట్రైలర్ కి వచ్చిన పాజిటీవ్ స్పందనతో ప్రీరిలీజ్ టైంకి సెకండ్ ట్రైలర్ ని కూడా రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారట మేకర్స్. దీనివల్ల అడ్వాన్స్ బుకింగ్ పెరిగే ఛాన్స్ ఉందని వీరి ఆలోచన. వరల్డ్ బిగ్గెస్ట్ ఫిలిం ఫెస్టివల్ లో దేవర ప్రదర్శిస్తున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం ఎన్టీఆర్ సెప్టెంబర్ 25 న అమెరికా వెళ్తున్నారు. అక్కడి ఫాన్స్ తో కలిసి థియేటర్స్ లో సినిమా చూడబోతున్నారని టాక్.  ఇక్కడ కూడా ఫాన్స్ అడ్వాన్స్ బుకింగ్స్ కోసం వెయిట్ చేస్తున్నారు.