ENGLISH

చిరు... మ‌హేష్‌లతో సినిమా... శ్రీ‌నువైట్ల ఏమ‌న్నాడు?

17 June 2021-10:15 AM

శ్రీ‌నువైట్ల‌.. ఒక‌ప్పుడు వ‌రుస‌గా బ్లాక్ బ‌స్ట‌ర్లు ఇచ్చిన ద‌ర్శ‌కుడు. చిరంజీవి ద‌గ్గ‌ర్నుంచి మ‌హేష్ బాబు వ‌ర‌కూ.. దాదాపుగా స్టార్ హీరోలంద‌రితోనూ ప‌నిచేశాడు. మ‌హేష్ తో అయితే రెండు సినిమాలు చేశాడు. ఇప్పుడు అటు చిరంజీవినీ, ఇటు మ‌హేష్ నీ క‌లిపి, శ్రీ‌నువైట్ల ఓ సినిమా చేస్తున్నాడ‌ని సోష‌ల్ మీడియా లో వార్త‌లు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. శ్రీ‌నువైట్ల ద‌గ్గ‌ర ఓ మ‌ల్టీస్టార‌ర్ స్క్రిప్టు ఉంద‌ని, దాన్ని చిరు, మ‌హేష్‌ల‌తో చేయాల‌ని భావిస్తున్నాడ‌ని రూమ‌ర్ల సారాంశం. దీనిపై శ్రీ‌నువైట్ల క్లారిటీ ఇచ్చాడు.

 

``నా ద‌గ్గ‌ర ఓ మ‌ల్టీస్టార‌ర్ క‌థ ఉన్న మాట వాస్త‌వ‌మే. దానికి `డ‌బుల్స్` అనే పేరు పెట్టా. అయితే హీరోలెవ‌రు అనే విష‌యంపై ఇంకా ఓ నిర్ణ‌యం తీసుకోలేదు`` అని రూమ‌ర్స్‌కి చెక్ పెట్టారు. శ్రీ‌నువైట్ల ఇప్పుడు `డీ అండ్ డీ` స్క్రిప్టుపై ఫోక‌స్ ఫోక‌స్ పెట్టారు. ఆ త‌ర‌వాత చేయ‌బోయే సినిమా క‌థ కూడా రెడీగానే ఉంద‌ట‌. ఈరెండు సినిమాలూ పూర్త‌యిన త‌ర‌వాతే... డ‌బుల్స్ ప‌ట్టాలెక్కుతుంది. ఈ రెండు సినిమాలూ హిట్ట‌యి... డ‌బుల్స్ కోసం చిరు, మ‌హేష్ ని సంప్ర‌దిస్తే. వాళ్లు... ఓకే చేసే అవ‌కాశం ఉంది. చూద్దా.. ఏమ‌వుతుందో?

ALSO READ: రాశీఖ‌న్నా.. సైకోకిల్ల‌ర్‌గా మారిందా?