ENGLISH

రాముడి పాత్రలో మహేష్?

13 November 2024-12:08 PM

మహేష్ బాబు, రాజమౌళి కాంబో మూవీ ఎప్పుడు మొదలవుతుందా అని ఫాన్స్ వెయిట్ చేస్తున్నారు. ఈలోగా ఈ మూవీకి సంభందించిన అనేక రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటివరకు హీరోయిన్ పై క్లారిటీ లేదు, విలన్ ఎవరన్నది కూడా కన్ఫర్మ్ కాలేదు. యాక్షన్ మూవీ అని, ఆఫ్రికా బ్యాక్ డ్రాప్ లో దట్టమైన అడవుల్లో జరిగే కథ అని తెలుస్తోంది. హాలీవుడ్ యాక్టర్స్ కూడా SSMB29 లో నటిస్తున్నారు . తాజాగా తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ ఈ సినిమా బడ్జెట్ 1000 కోట్లు దాటి అవుతుందని తెలిపారు.ఇప్పుడు ఇంకొక అదిరిపోయే అప్డేట్ వచ్చింది SSMB29 నుంచి.

ఇప్పటివరకు వినిపించిన దానికి భిన్నంగా ఇప్పుడింకో వార్తా వినిపిస్తోంది. ఈ స్టోరీ వార‌ణాసి నేప‌థ్యంలో మొద‌లవుతుంద‌ని, మహేష్ బాబు శ్రీ రాముడి అవతారం లో కనిపించనున్నట్లు సమాచారం. వారణాసి నుంచి క‌థ సౌత్ ఆఫ్రికాకు షిఫ్ట్ అవుతుంద‌ని టాక్. అయితే వార‌ణాసి షెడ్యూల్ మొత్తాన్ని సెట్ లోనే పూర్తి చేయాల‌ని రాజ‌మౌళి ప్లాన్ చేస్తున్నారట. ఇందుకోసం హైద‌రాబాద్ లో వారణాసి సెట్ భారీగా వేయనున్నట్లు సమాచారం. ప్రస్తుతం మైథిలాజికల్ కథలు మంచి ట్రెండింగ్ లో ఉన్నాయి. ఇదే ట్రెండ్ ని ఫాలో అవుతూ  SSMB29 కి కూడా  మైథలాజికల్ టచ్ ఇవ్వనున్నారు జక్కన్న.

RRR సినిమాలో ఒక్క సీన్ లో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు గా కనిపిస్తేనే గూస్ బంప్స్ వచ్చాయి. అలాంటిది మహేష్ బాబు శ్రీ రాముడి పాత్రలో కనిపిస్తే ఇంకేమైనా ఉందా. మొత్తానికి రాజమౌళి గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటివరకు పురాణ పాత్రల్లో కనిపించని మహేష్ ని మొదటి సారి రాముడిగా చూడటానికి ఫాన్స్ వెయిట్ చేస్తున్నారు. పైగా హిందువులు పవిత్ర క్షేత్రంగా భావించే కాశీ నేపథ్యంలో కథ అని తెలిసి ఉత్సాహంగా ఉన్నారు సినీప్రియులు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ అయింది. అడ్వెంచర్ యాక్షన్ సీన్స్ కి అధిక ప్రాధాన్యత ఇస్తూ అడవుల్లోనే ఎక్కువ పార్ట్  షూటింగ్ ఉండనుంది.