'పుష్ప' అనగానే అల్లు అర్జున్ క్యారెక్టరైజేషన్, ఆ హీరోయిజం, మేననిజం, మాస్ అంశాలు, ఎలివేషన్లు, యాక్షన్ దృశ్యాలు గుర్తొస్తాయి. పార్ట్ 1లో ఎక్కువగా ఇవే కనిపించాయి. పార్ట్ 2లో వీటితో పాటు మరో ఎలిమెంట్ కు చోటిచ్చాడు సుకుమార్. అదే... భార్యాభర్తల అనుబంధం. పుష్ప - శ్రీవల్లీ మధ్య రొమాన్స్‌ని చాలా కొత్తగా ఆవిష్కరించాడట సుకుమార్. నిజానికి భార్యా భర్తల ఎమోషన్స్ ని చూపించే అవకాశం సుకుమార్ గత చిత్రాల్లో ఎప్పుడూ రాలేదు. ఈసారి దాన్ని పూర్తి స్థాయిలో వాడుకొంటున్నాడట. 'పుష్ప 2'లో ఇది సర్ప్రైజింగ్ ప్యాకేజీలా కనిపించబోతోందని ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి.
విలన్ గ్యాంగ్ కూడా ఈ సినిమాలో జోరుగానే కనిపిస్తోంది. ఫహద్ ఫాజిల్, సునీల్, రావు రమేష్, అనసూయ, అజయ్ ఘోష్, ధునంజయ్ వీళ్లంతా ఫస్ట్ పార్ట్ లో కనిపించారు. ఇప్పుడు వీళ్లందరికీ మరో అరడజను మంది విలన్లు తోడవుతున్నారు. వాళ్లలో జగపతిబాబు కూడా ఉన్నాడు. నాన్నకు ప్రేమతో, రంగస్థలం చిత్రాల్లో జగపతిబాబుకి మంచి పాత్రలు ఇచ్చాడు సుకుమార్. ఈసారి జగపతిబాబు క్యారెక్టర్ మరింత సర్ప్రైజింగ్ గా ఉండబోతోందని తెలుస్తోంది. ఈనెల 17న ట్రైలర్ వస్తోంది. దీంతో... పుష్ప 2 హంగామా తెలుగు రాష్ట్రాల్లో మొదలైపోయినట్టే. పుష్ప1కి ప్రమోషన్లు అనుకొన్న రీతిలో జరగలేదు. ఈసారి మాత్రం దేశ వ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాల్లోనూ ప్రమోషన్లు జోరుగా చేయాలని చిత్రబృందం డిసైడ్ అయ్యింది.