ENGLISH

స్టే ట్యూన్డ్‌: ఫాలో ద నిత్యామీనన్‌.!

28 January 2020-17:00 PM

హండ్రెడ్‌ పర్సంట్‌ నటి అనిపించుకోవాలంటే ఏం చేయాలో తెలుసా.? అయితే నిత్యామీనన్‌ చెప్పే ఈ ముద్దు ముచ్చట్లు కొన్ని మీకు తెలియాల్సిందే. ఏ భాషలో నటించినా ఆ భాషను ప్రత్యేకించి నేర్చుకుని మరీ, తన పాత్రకు తానే డబ్బింగ్‌ చెప్పుకునే ముద్దుగుమ్మ నిత్యా మీనన్‌. అవును నిత్యా మల్టీ టాలెంటెడ్‌ అన్న సంగతి అందరికీ తెలిసిందే. అవకాశాల కోసం వెంపర్లాడదు. కథ నచ్చితే చిన్న పాత్రకైనా వెనుకాడదు. అందుకే విలక్షణ నటి అనిపించుకుంటోంది. అయితే, హీరోయిన్లు అందరూ డబ్బింగ్‌ చెప్పుకోవాలన్న రూలేం లేదు. కానీ, ఆ విషయంలో నిత్య మాత్రం సమ్‌థింగ్‌ డిఫరెంట్‌.

 

తన పాత్రకు ఎవరితోనూ డబ్బింగ్‌ చెప్పనీయదు. ఎందుకలా.? అంటే, తన పాత్రకు తాను డబ్బింగ్‌ చెప్పుకుంటేనే తనలోని హండ్రెడ్‌ పర్సంట్‌ నటి బయటికి వస్తుందని చెబుతోంది అందాల నిత్యామీనన్‌. అంతేకాదు, ఒకే సినిమా ('గుండె జారి గల్లంతయ్యిందే') లో తనతో పాటు నటించిన మరో హీరోయిన్‌ (ఇషా తల్వార్‌)కి కూడా డబ్బింగ్‌ చెప్పిన ఘనత నిత్యాకే దక్కింది. అందుకే నిత్య సమ్‌థింగ్‌ స్పెషల్‌. తెలుగు, తమిళ, మలయాళ తదితర సౌత్‌ భాషలతో పాటు, ఇటీవలే నార్త్‌లో కూడా అడుగుపెట్టింది. 'మిషన్‌ మంగళ్‌' సినిమాలో నటించి, తొలి సినిమాకే బాలీవుడ్‌ ప్రేక్షకులతో పాటు, ఖిలాడీ అక్షయ్‌ కుమార్‌ని ఇంప్రెస్‌ చేసింది. ఇలా ఎక్కడ కనిపించినా తనదైన ఆటిట్యూడ్‌తో యాక్టింగ్‌ టాలెంట్‌తో దూసుకెళ్లిపోతోంది నిత్యామీనన్‌. తమిళంలో దివంగత ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్‌ 'ది ఐరెన్‌ లేడీ' లో ప్రస్తుతం నిత్యామీనన్‌ నటిస్తోంది.

ALSO READ: Nithya Menen Latest Photoshoot