ENGLISH

ఓటీటీలో సుకుమార్ ప్ర‌యోగం

20 September 2020-11:00 AM

ఇప్పుడు ఓటీటీ వేదిక‌ల‌కు, వెబ్ సిరీస్‌ల‌కు డిమాండ్ బాగా పెరిగిన సంగ‌తి తెలిసిందే. బ‌డా ద‌ర్శ‌కులు సైతం వెబ్ సిరీస్ ల‌వైపు మొగ్గు చూపిస్తున్నారు. అందులో భాగంగా సుకుమార్ ద‌ర్శ‌క‌త్వ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ఓ వెబ్ సిరీస్ రూపొంద‌నున్న‌ద‌ని స‌మాచారం. ఈ వెబ్ సిరీస్ కి క‌థ(లు) సుక్కునే అందించాడు. ఇది 9 క‌థ‌ల స‌మాహారం. అన్నీ ప్రేమ‌క‌థ‌లే. ఒక్కో క‌థ‌నీ ఒక్కో ద‌ర్శ‌కుడు డీల్ చేయ‌నున్నాడు.

 

సుకుమార్ ‌ద‌గ్గ‌ర స‌హాయ‌కులుగా ప‌నిచేసిన వాళ్లే.. ఆయా ఎపిసోడ్ల‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తార్ట‌. త‌మిళంలో మ‌ణిర‌త్నం `న‌వ‌ర‌స‌` అనే వెబ్ సిరీస్ తీస్తున్నారు. 9 ఎపిసోడ్ల‌కు 9మంది ద‌ర్శ‌కత్వం వ‌హిస్తారు. అదే స్టైల్‌లో సుక్కు ఈ వెబ్ సిరీస్ ప్లాన్ చేయ‌నున్నాడు. మ‌రోవైపు `పుష్ష‌` ప్లానింగ్ లో బిజీగా ఉన్నాడు సుకుమార్‌. అక్టోబ‌రులో ఈ సినిమా షూటింగ్ మొద‌లెట్టాల‌న్న కృత నిశ్చ‌యంతో ఉన్నాడు. బ‌న్నీ కూడా షూటింగుల‌కు రెడీగా ఉన్నాడ‌ని, ప్ర‌స్తుతం సుకుమార్ లొకేష‌న్ల వేట మొద‌లెట్టాడ‌ని స‌మాచారం అందుతోంది.

ALSO READ: ‘జీరో రెమ్యునరేషన్‌’ అంటున్న మెగాస్టార్‌.!