ENGLISH

బాలీవుడ్ లో ఎగ‌ర‌బోతున్న సూర్య విమానం

12 July 2021-12:03 PM

సూర్య క‌థానాయ‌కుడిగా న‌టించిన త‌మిళ చిత్రం శూరరై పోట్రు. ఈ చిత్రాన్ని తెలుగులో 'ఆకాశం నీ హద్దురా'గా అనువాదం చేశారు. ఈ చిత్రం విమ‌ర్శ‌కుల‌ ప్రశంసలు అందుకుంది. బాక్సాఫీసు ద‌గ్గ‌ర కూడా రాణించింది. ఇప్పుడు ఈ సినిమాను బాలీవుడ్‌లో రీమేక్‌ చేయబోతున్నారు. హిందీలోనూ సూర్య‌నే ఈ చిత్రానికి నిర్మాత‌.

 

తమిళంలో సినిమాను తెరకెక్కించిన దర్శకుడు సుధా కొంగరనే బాలీవుడ్‌లోనూ డైరెక్ట్‌ చేయబోతున్నారు. మరి హీరోగా ఎవరు నటిస్తారనే దానిపై ఇంకా క్లారిటీ మాత్రం రాలేదు. డెక్కన్‌ ఎయిర్‌ వేస్‌ అధినేత ఆర్‌.గోపీనాథ్‌ గురించి రాసిన పుస్తకం సింప్లి ఫ్లైను ఆధారంగా చేసుకుని కొన్ని సినిమాటిక్‌ మార్పులు చేర్పులు చేసి 'శూరరై పోట్రు' సినిమాను తెరకెక్కించారు. గ‌తంలో సూర్య న‌టించిన ప‌లు త‌మిళ చిత్రాలు బాలీవుడ్ లో రీమేక్ అయ్యాయి. అక్క‌డి హీరోల‌కు మ‌రింత మైలేజీ తీసుకొచ్చాయి. మ‌రి ఈసారి ఆ అదృష్టం ఎవ‌రికి ద‌క్కుతుందో చూడాలి.

ALSO READ: కండ‌ల‌తో క‌ట్టిప‌డేస్తున్న అఖిల్‌!