ENGLISH

వారం ఉన్నాడంతే... ల‌క్ష‌ల్లో సంపాదించేశాడ.

19 September 2020-08:00 AM

బిగ్ బాస్ 4 సీజ‌న్‌లో గ‌ట్టి పోటీ ఇస్తాడ‌నుకున్న సూర్య కిర‌ణ్‌... తొలి వార‌మే ఎలిమినేట్ అయిపోయి అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు. సూర్య కిర‌ణ్ ఇంత తొంద‌ర‌గా బ‌య‌ట‌కు వ‌చ్చేస్తాడ‌ని ఎవ‌రూ ఊహించ‌లేదు. అయితే... ఇంత త్వ‌ర‌గా ఎలిమినేట్ అయిపోవ‌డం ప‌ట్ల సూర్య కిర‌ణ్ కూడా ఏమంత బాధ ప‌డ‌డం లేదు. పైగా.. తాను బిగ్ బాస్ హౌస్‌లో ఇమ‌డ‌లేక‌పోయాయ‌న‌ని, బ‌య‌ట‌కు వ‌చ్చేయ‌డ‌మే మంచిదైంద‌ని చెబుతున్నాడు. తొలి వార‌మే బ‌య‌ట‌కు వ‌చ్చేసినా - సూర్య కిర‌ణ్‌కి బాగానే గిట్టుబాటు అయ్యింద‌ని టాక్‌.

 

త‌న‌కు ఎంత పారితోషికం ఇచ్చారో బ‌య‌ట‌కు చెప్ప‌డం లేదు గానీ, అనుకున్న‌దానికంటే బిగ్ బాస్ నుంచి ఎక్కువ మొత్త‌మే వ‌చ్చింద‌ని సంతోష‌ప‌డుతున్నాడు. ``ముందు చెప్పిన దానికంటే మంచి పారితోషిక‌మే అందింది. ఈ పారితోషికంతో దాదాపు ఐదారు నెల‌లు హాయిగా గ‌డిపేయొచ్చు`` అంటున్నాడు సూర్య కిర‌ణ్‌. రోజుకి ఒక ల‌క్ష చెప్పున వారం రోజుల‌కు గానూ ఏడు ల‌క్ష‌ల పారితోషికం అందుకున్నాడ‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. రోజుకి ల‌క్ష సంపాదించ‌డం అంటే మాట‌లా ఏంటి? సూర్య కిర‌ణ్కి గిట్టుబాటు అయిన‌ట్టే.

ALSO READ: 'అమ‌రం అఖిలం ప్రేమ‌' మూవీ రివ్యూ & రేటింగ్!