ENGLISH

తాప్పీ టాలీవుడ్‌లో ఎవర్ని టార్గెట్‌ చేసిందో!

20 November 2020-12:00 PM

హీరోయిన్‌ తాప్సీకి కెరీర్‌లో కొట్టిన హిట్స్‌ కంటే, వివాదాల మీదనే ఫోకస్‌ ఎక్కువేమో.! ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లోకెక్కేందుకు ప్రయత్నిస్తుంటుందనే విమర్శలు ఊరికే ఆమె మీద వస్తాయని ఎలా అనుకోగలం.? ఆమె చేసే పనులూ అలాగే వుంటాయ్‌. కొన్నాళ్ళ క్రితం దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుపై తాప్సీ అనుచిత వ్యాఖ్యలు చేసింది. ఆ తర్వాత ఆ వ్యాఖ్యల్ని ఉపసంహరించుకోవాల్సి వచ్చింది.. క్షమాపణ కూడా చెప్పింది. తాజాగా మరో మారు తాప్సీ సినీ జనాలపై అనుచిత వ్యాఖ్యలు చేసింది. ఈసారి ఓ హీరో భార్య మీదా, మరో నిర్మాత మీదా తాప్సీ చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్నాయి.

 

‘నేను చాలా స్ట్రెయిట్‌ ఫార్వార్డ్‌ మనిషిని.. ఏదైనా ముక్కుసూటిగానే మాట్లాడతాను.. ఏ విషయంలోనూ భయపడను..’ అని చెప్పే తాప్సీ, తనను ఇబ్బంది పెట్టిన హీరో భార్య పేరుని ఎందుక బయటపెట్టలేదు? అన్నదీ ఆలోచించాల్సిన విషయమే. ఏదో వివాదాన్ని రాజేసి, పబ్లిసిటీ పొందాలన్న ప్రయత్నం తప్ప, తాప్సీ మాటల్లో విశ్వసనీయత వుండదనే అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది. సౌత్‌ సినీ పరిశ్రమ ద్వారానే తాప్సీకి మంచి గుర్తింపు దక్కింది. అందునా, తెలుగు సినిమాలతోనే ఆమెకు హీరోయిన్‌గా ఓ రేంజ్‌ వచ్చింది. ఆ తర్వాతే బాలీవుడ్‌లో సెటిలయ్యింది. ఉద్దేశ్యపూర్వకంగా టాలీవుడ్‌ని ఆమె టార్గెట్‌ చేసిందా? లేదంటే, బాలీవుడ్‌లో ఎవరి మీదనే వున్న వేడిని ఆమె ఇలా చల్లార్చుకుందా? అనేది మాత్రం ఆమెకే తెలియాలి.

ALSO READ: Taapsee Latest Photoshoot