ENGLISH

అప్పుడు తమన్నా, ఇప్పుడు రెజీనా!

31 January 2020-18:00 PM

అప్పుడెప్పుడో 'రచ్చ' సినిమాలో కొడుకు చెర్రీతో కలిసి మిల్కీ బ్యూటీ వేసిన స్టెప్పులకు ఫిదా అయిపోయిన మెగాస్టార్‌ చిరంజీవి అప్పుడే ఆమెకు మాటిచ్చేశారు తన సినిమాలో ఛాన్స్‌ ఇస్తానని. ఆ మాటను నిలబెట్టుకుంటూ, డాన్స్‌ ప్రధానాంశమైన క్యారెక్టర్‌ ఇచ్చి 'సైరా'లో మాట నిలబెట్టుకున్నారు. ఇప్పుడు అలాంటి అవకాశమే ముద్దుగుమ్మ రెజీనా కొట్టేసినట్లు తెలుస్తోంది. ఈ మధ్య హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ పాత్రలతో రెజీనా దూసుకెళుతోన్న సంగతి తెలిసిందే.

 

ఈ క్రమంలోనే మెగాస్టార్‌ చిరంజీవి 152వ సినిమాలో స్పెషల్‌ సాంగ్‌ ఛాన్స్‌ కొట్టేసిందనే గాసిప్స్‌ వచ్చాయి. అయితే ఇవి గాసిప్స్‌ కావని తెలుస్తోంది. నిజంగానే రెజీనా, చిరంజీవితో డాన్స్‌ చేసే బంపర్‌ ఛాన్స్‌ కొట్టేసిందట. కొరటాల - చిరంజీవి కాంబో మూవీలో రెజీనాపై ఆల్రెడీ ఆ స్పెషల్‌ సాంగ్‌ చిత్రీకరణ జరిగిపోయిందనీ తాజా సమాచారం. ఇక రెజీనా మంచి డాన్సర్‌ అన్న సంగతి తెలిసిందే. ఫ్రెష్‌ అప్‌డేట్‌ ప్రకారం, రెజీనా తన డాన్స్‌తో మెగాస్టార్‌ చిరంజీవినే ఇంప్రెస్‌ చేసిందట.

 

డాన్స్‌ చేసేవాళ్లను ఎప్పుడూ చిరంజీవి ఎంకరేజ్‌ చేస్తూనే ఉంటారు. అలాగే రెజీనాని కూడా ప్రశంసలతో ముంచెత్తేశారట. ప్రశంసలొక్కటే కాదు, బ్రైట్‌ ఫ్యూచర్‌ ఉంటుందంటూ ఆశీర్వాదాలు కూడా ఇచ్చేశారట. దాంతో రెజీనా ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బయిపోతోందట. ఇదిలా ఉంటే, మెగాస్టార్‌తో స్పెషల్‌ సాంగ్‌కి రెజీనా నో చెప్పిందన్న వార్తల్లో నిజం లేదని ఈ లేటెస్ట్‌ అప్‌డేట్‌ ద్వారా అర్ధం చేసుకోవాలేమో.

ALSO READ: Regina Latest Hot Photoshoot