ENGLISH

నాలుగు రోజులు... రూ.75 ల‌క్ష‌లు..

27 July 2021-10:13 AM

దీపం ఉండ‌గానే ఇల్లు చ‌క్క‌బెట్టుకోవ‌డం ఎలాగో మ‌న క‌థానాయిక‌ల‌కు బాగా తెలుసు. ముఖ్యంగా త‌మ‌న్నాకు. అగ్ర క‌థానాయిక‌ల్లో ఐటెమ్ గీతాలు ఎక్కువగా చేసింది త‌మ‌న్నానే. ఆ రూపేణా బాగానే సంపాదించింది. ఒక్కో పాట‌కూ అర కోటి వ‌సూలు చేసేది. త‌మ‌న్నా క్రేజ్ అలాంటిది కాబ‌ట్టి, త‌మ‌న్నా అడిగినంత ఇచ్చేవారు నిర్మాత‌లు. ఇప్పుడు త‌మ‌న్నాకు పెద్ద‌గా సినిమాల్లేవు. కానీ... ఐటెమ్ గీతం అనేస‌రికి మాత్రం అదిరిపోయే రేటు వ‌సూలు చేస్తోంది.

 

వ‌రుణ్ తేజ్ క‌థానాయ‌కుడిగా `గ‌ని` రూపుదిద్దుకుంటున్న సంగ‌తి తెలిసిందే. ఉపేంద్ర‌, సునీల్ శెట్టి కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. ఇందులో త‌మ‌న్నా ఓ ప్ర‌త్యేక గీతంలో న‌ర్తించ‌బోతోంది. అందుకు గానూ.. ఏకంగా 75 ల‌క్ష‌లు వ‌సూలు చేస్తోంద‌ట‌. సాధార‌ణంగా ఒక్కో సినిమాకీ త‌మ‌న్నా పారితోషికం రూ.1 కోటికీ.. కోటిన్న‌రకీ మ‌ధ్య ఉంటుంది. అందుకోసం క‌నీసం 30 నుంచి 50 రోజుల కాల్షీట్లు ఇవ్వాలి. ఈ పాట కేవ‌లం 4 రోజుల్లో పూర్తి చేస్తార‌ట‌. అయినా స‌రే, 75 ల‌క్ష‌లు ఛార్జ్ చేస్తోందంటే, ఇది మామూలు రేటు కాదు. అయినా స‌రే - నిర్మాత‌లు రెడీ అయిపోతున్నారు. యేడాదికి ఇలాంటి ఆఫ‌ర్లు రెండు మూడు ప‌డితే - త‌మ‌న్నా ఇక సినిమాలు కూడా చేయ‌క్క‌ర్లెద్దు. ఐటెమ్ రాణీగా ఉండిపోవొచ్చు.

ALSO READ: Tamanna Latest Photoshoot