రీసెంట్ గా అబుదాబిలో జరిగిన ఐఫా అవార్డ్స్ ఫంక్షన్ కి రానా దగ్గుబాటి, తేజ సజ్జా హోస్ట్ లుగా వ్యవహరించారు. యాంకరింగ్ లో భాగంగా వీక్షకుల్ని నవ్వించటానికి మహేష్ బాబు నటించిన గుంటూరు కారం, రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమాలపై జోక్స్ వేశారు. కావాలని చేయకపోయినా, పార్ట్ ఆఫ్ ది యాంకిరింగ్ అయినా అవి తేజాని విమర్శలకి గురి చేశాయి. ఐఫా తరవాత తేజా పై ట్రోల్స్ మొదలయ్యాయి. అక్కడున్నవారు సరదాగా తీసుకున్నా ఫాన్స్ మాత్రం ఆ విషయాన్ని సీరియస్ గా తీసుకుని తేజా సజ్జను ట్రోల్ చేయడం ప్రారంభించారు. ఈ వివాదం పై ఇప్పటికే రానా స్పందించగా, ఇప్పుడు తేజా సజ్జ కూడా స్పందించాడు.
చైల్డ్ ఆర్టిస్ట్‌గా తాను చాలా మంది హీరోలతో నటించానని, వారితో గొప్ప అనుబంధం ఉందనిపేర్కొన్నాడు తేజా సజ్జ. పూర్తి విడియోలని చూడకుండా కేవలం రెండు మూడు కట్టింగ్స్ క్లిపింగ్స్ చూసి అపార్థం చేసుకున్నారని, పూర్తి వీడియో చూస్తే మొత్తం విషయం క్లారిటీ వస్తుంది అని స్పష్టం చేసాడు తేజా. నా పై రానా వేసిన జోకులు కూడా సరదాగా తీసుకున్నాను, అందరి సూపర్ స్టార్స్ తో కలిసి చిన్నప్పుడు వర్క్ చేశా. అందరితో నాకు మంచి రిలేషన్స్ ఉన్నాయి. నేను ఎవర్నీ కించపరిచేలా మాట్లాడలేదు. ఇదంతా కావాలని ఎవరైనా చేస్తునారా? లేదా అలా అపార్థం చేసుకున్నారా అన్నది నిజంగా నాకు అర్థం అవటం లేదు. అని వాపోయాడు తేజా.
ఐఫా ఉత్సవానికి సినీ పరిశ్రమలో ఎంతో ప్రాధాన్యత ఉంది. ఇదొక నేషనల్ ఈవెంట్. ఈ ఈవెంట్ కోసం చాలా మంది స్క్రిప్ట్ రైటర్స్ వర్క్ చేస్తుంటారు. మా స్క్రిప్ట్ కూడా చెక్ చేసిన తర్వాతే ఇచ్చారు. నిజంగా అభ్యంతరకరంగా ఉంటే ఎందుకు అనుమతిస్తారు అని తేజా క్లారిటీ ఇచ్చాడు. తేజా సజ్జ ప్రస్తుతం మిరాయ్ సినిమాలో నటిస్తున్నాడు. హనుమాన్ తో పాన్ ఇండియా హిట్ అందుకున్న తేజా ఇలాంటి కాంట్రవర్సిలో చిక్కుకోవటం విచారకరమే.