ENGLISH

‘హోం థియేటర్లలో’ కిక్కు సరిపోదంతే.!

05 September 2020-18:16 PM

సినిమా.. అంటే అతి ది¸యేటర్లలోనే విడుదలవ్వాలి. వేరే దారి లేక ఓటీటీల్లో సినిమా విడుదల చేస్తే.. అసలంటూ సినిమా తాలూకు ‘కిక్కు’ వుండదు. ‘వి’ సినిమా విషయంలో అది ప్రూవ్‌ అయ్యింది. మామూలుగా సినిమా ది¸యేటర్లలో విడుదలైతేనే, సోషల్‌ మీడియాలో ఎప్పటికప్పుడు క్లిప్పింగ్స్‌ దర్శనమిచ్చేస్తుంటాయి లీకుల రూపంలో. అలాంటిది, ఇంట్లో.. సినిమా ప్లే అవుతోంటే ఆగుతారా.? ఓ పక్క అమెజాన్‌ ప్రైమ్ ద్వారా సినిమా వస్తోంటే, ఇంకోపక్క. వాట్సాప్‌ సహా ఇతర మార్గాల్లో సినిమా క్లిప్పింగులు హల్‌చల్‌ చేసేశాయి. అవన్నీ ఓ ఎత్తు. సినీ ప్రముఖులు ఇళ్ళలోని హోం ది¸యేటర్లలో ‘వి’ తిలకించేశారు.

 

అలా ‘వి’ సినిమా ప్రమోషన్‌ కోసం టాలీవుడ్‌లో కొందరు ప్రముఖులు చేయాల్సిందంతా చేశారు. కానీ, సినిమా ది¸యేటర్లలో విడుదలయితే వచ్చే కిక్కు మాత్రం రాదు కదా.! ‘ఫస్ట్‌ డే ఫస్ట్‌ షో’ అనే కిక్కు లభించకపోవడం బాధాకరమంటూ చాలామంది సెలబ్రిటీలు సోషల్‌ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. అభిమానుల పరిస్థితి ఇంకెంత దారుణంగా వుంటుందో అర్థం చేసుకోవచ్చు. ‘వి’ సినిమా రిజల్ట్‌ ఏంటి.? అన్న విషయాన్ని పక్కన పెడితే, ‘సినిమాల్ని ది¸యేటర్లలో మాత్రమే చూడాలి..’ అన్న భావనను ‘వి’ ఓటీటీ రిలీజ్‌ కలిగించిందన్నది నిర్వివాదాంశం. సినిమా ప్రమోషనల్‌ ఈవెంట్స్‌ లేకుండా, ది¸యేటర్ల వద్ద హంగామా లేకుండా సినిమా ఏంటి.? అస్సలేమాత్రం సబబు కాదిది. సినిమా అంటే అన్నీ వుండాలి. అవి లేనప్పుడు అదసలు సినిమానే కాదు.

ALSO READ: పబ్లిక్‌లో ‘స్పోర్ట్స్‌ బ్రా’ ప్రదర్శనతో హీరోయిన్