ENGLISH

అంతలా త్రిషను బాధించిందెవరు?

20 June 2018-14:46 PM

అందాల భామ త్రిష పెళ్లి చేసుకోబోతోందనే వార్త అభిమానుల్ని కూసింత గందరగోళానికి గురి చేసినా, తమ అభిమాన నటి ఒకింటిదవుతుందనే ఆనందం వ్యక్తం చేశారు. అయితే ఆ తర్వాత కొంత కాలానికే ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్న త్రిష వివాహం రద్దు చేసుకోవడం, సినిమాల్లో బిజీ అయిపోవడం అన్నీ చకచకా జరిగిపోయాయ్‌. 

ఇప్పుడు త్రిష చేతిలో ఐదారు సినిమాల వరకూ ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. అన్నీ హీరోయిన్‌ సెంట్రిక్‌ మూవీసే కావడం మరో విశేషం. కాగా ఏదో బిజీగా సినిమాలైతే చేసేస్తోంది కానీ, త్రిషలో ఏదో తెలీని మనస్తాపం ఆమెను వెంటాడుతోందట. ఎవర్నీ గుడ్డిగా నమ్మరాదు. మన పక్కనే ఉన్నారు కదా, మన కష్ట సుఖాలు పంచుకుంటున్నారు కదా.. అని స్నేహితులందర్నీ కూడా గట్టిగా నమ్మడం మంచిది కాదనే నీతి సూత్రాలు వల్లిస్తోంది అందాల భామ త్రిష. 

అసలింతకీ త్రిషకు ఏమైంది.? ఇలాంటి నీతి సూత్రాలు వల్లించాల్సిన అవసరం త్రిషకు ఏమొచ్చింది.? సమ్‌థింగ్‌ హేజ్‌ గాన్‌. త్రిషకు ఏదో అయ్యింది. అనుకుంటున్నారు ఈ మాటలు విన్న ఆమె సన్నిహితులు. తెలుగులో ప్రస్తుతం త్రిష సినిమాలు చేయడం లేదు. కానీ తమిళంలో నయనతార తర్వాత మోస్ట్‌ బిజీయెస్ట్‌ హీరోయిన్‌ త్రిష అనే చెప్పాలి. 

ఆమె నటించిన హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ మూవీ 'మోహిని' త్వరలో విడుదలకు సిద్ధంగా ఉంది. తెలుగులో స్టార్‌ హీరోలందరి సరసన నటించేసిన త్రిష, మంచి ఛాన్సొస్తే తెలుగులో మళ్లీ రీ ఎంట్రీ ఇస్తానంటోంది.

ALSO READ: పవన్ కళ్యాణ్ కి ఝలక్ ఇచ్చిన బండ్ల గణేష్