ENGLISH

పెళ్ళి విషయంలో త్రిష నైరాశ్యం.. నిజమెంత.?

19 November 2020-10:00 AM

‘నాకు నచ్చిన వ్యక్తి దొరికితే పెళ్ళి చేసుకుంటా.. దొరక్కపోతే జీవితాంతం ఒంటరిగానే వుంటా..’ అంటూ లేటెస్ట్‌గా త్రిష ఇచ్చిన స్టేట్‌మెంట్‌ హాట్‌ టాపిక్‌గా మారింది. అయితే, తానేదో సరదాగా చేసిన కామెంట్‌ని పట్టుకుని, తాను అసలు పెళ్ళి చేసుకోనని చెప్పినట్లుగా జరుగుతున్న ప్రచారాన్ని త్రిష తీవ్రంగా ఖండిస్తోంది. త్రిష గతంలో ఓ వ్యక్తిని ప్రేమించింది, వ్యవహారం దాదాపు పెళ్ళిదాకా వెళ్ళింది. కానీ, చివరి నిమిషంలో ఆ పెళ్ళి వాయిదా పడింది. మరోపక్క, త్రిష చుట్టూ ‘ఎఫైర్‌ గాసిప్స్‌’ చాలా చాలా వచ్చాయి, వస్తూనే వున్నాయి. ఇటీవల ఓ తమిళ హీరోతో ఆమె ప్రేమలో పడిందంటూ ప్రచారం జరిగిన విషయం విదితమే. కానీ, త్రిష మాత్రం ‘ప్రస్తుతానికి నో టైం ఫర్‌ లవ్‌’ అని తేల్చేసింది.

 

ప్రస్తుతం తన దృష్టి అంతా కెరీర్‌ మీదనే వుందనీ, పెళ్ళి గురించిన ఆలోచనే చేయడంలేదని త్రిష ఇంకోసారి క్లారిటీ ఇచ్చేసింది. ‘నేను పెళ్ళికి వ్యతిరేకం కాదు.. ప్రేమ విషయంలోనూ అంతే. ఈ సమయంలో ఇప్పుడు నేను సింగిల్‌గానే వున్నాను.. ఈ సింగిల్‌ స్టేటస్‌ ఇంకెన్నాళ్ళనేది నేను చెప్పలేను..’ అని తాజాగా త్రిష స్పష్టం చేసింది. ‘ఏమో, నచ్చిన వ్యక్తి దొరికితే త్వరలోనే పెళ్ళి చేసుకుంటానేమో’ అంటున్న త్రిష, పెళ్ళి చేసుకున్నాసరే, సినిమా కెరీర్‌ని కొనసాగిస్తాననీ, సినిమా కెరీర్‌ విషయంలో అడ్డు చెప్పని వ్యక్తినే పెళ్ళాడతాననీ చెబుతోందిట. ప్రస్తుతం త్రిష తమిళంలో పలు సినిమాలతో బిజీగా వుంది.

ALSO READ: Trisha Latest PHotoshoot