ENGLISH

నా కొడుకుని క్షమించండి: ప్రముఖ గాయకుడు

06 October 2017-18:49 PM

ఈ మధ్యనే రాయిపూర్ విమానాశ్రయంలో ప్రముఖ గాయకుడు ఉదిత్ నారాయణ్ కుమారుడు అయిన ఆదిత్య అక్కడి విమానాశ్రయ సిబ్బందితో పడిన గొడవ ఎంత సంచలనం సృష్టించిందో తెలిసిందే.

అయితే ఈ విషయంలో తన కొడుకుని అందరు టార్గెట్ చేసి విమర్శిస్తుండడంతో గాయకుడు ఉదిత్ నారాయణ్ ఈ విషయమై స్పందించారు. తమకి ఒక్కడే సంతానం అవ్వడంతో చిన్నతనం నుండి చాలా పద్ధతిగా ఆదిత్యాని పెంచామని అలాంటిది తను ఇలాంటి వాగ్వాదానికి దిగుతాడని ఊహించలేదు అని చెప్పాడు.

కాకపోతే తన కొడుకు క్షణికావేశంలో చేసి ఉంటాడు అని తాను ముంబై వచ్చాక తన కొడుకు ఆదిత్య తో క్షమాపణ చెప్పిస్తానని అందరికి హామీ ఇచ్చాడు. అదే సమయంలో మీడియా, ప్రజానీకం ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయ్యమని కోరాడు, తన కొడుకుచేసిన తప్పుకి క్షమించమని కోరాతాడు అని ఇక ఈ అంశాన్ని దయచేసి పెద్దదిగా చేయకండి అని విజ్ఞప్తి చేశాడు.

 

ALSO READ: ఎన్టీఆర్ బయోపిక్ పైన ఆర్జీవీ పొలిటికల్ స్టంట్?!