పుష్ప ట్రైలర్ అదిరిపోయింది. ఇదో మాస్ పార్టీలా ఉండబోతోందని సుకుమార్ హింట్ ఇచ్చేశాడు. పుష్ప రాజ్‌గా అల్లు అర్జున్ గెటప్, హెయిర్ స్టైల్, డ్రస్సింగ్, బాడీ లాంగ్వేజ్ ఇవన్నీఅదరహో అంటున్నారు ఫ్యాన్స్. డైలాగులు కూడా ఔట్లలా పేలాయి. ఈ యేడాది అతి పెద్ద హిట్స్ లో పుష్ప చేరే అకావశాలు పుష్కలంగా ఉన్నాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
పుష్ప ఏం రియల్ స్టోరీ కాదు. కల్పిత కథ. అయితే సుకుమార్ ఈ కథ రాసేటప్పుడు వీరప్పన్‌ని మైండ్‌లో పెట్టుకున్నాడట. ఎందుకంటే...పుష్ప ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగుతుంది. గంధపు చెక్కల స్మగ్లింగ్‌లో.. ఆరితేరిపోయినవాడు వీరప్పన్. తను పోలీసులు, అధికారుల కళ్లుగప్పి స్మగ్లింగ్ ఎలా చేసేవాడు..? తన టీమ్ ఎలా పనిచేసేది? పని విషయంలో వీరప్పన్ ఎంత క్రూరంగా ఉండేవాడు.? ఇలాంటి ఇషయాల్ని సుకుమార్ ఈ కథ రాస్తున్నప్పుడు పరిగణలోనికి తీసుకున్నాడట. స్మగ్లింగ్ వెనుక వీరప్పన్ టెక్నిక్కులు, ప్లానింగులు అవన్నీ పుష్పకి ఆపాదించినట్టు తెలుస్తోంది. అంటే.. ఓ రకంగా.. ఇందులో వీరప్పన్ కథ కూడా ఉందన్నమాట.