ENGLISH

వెంకీ, రానా మల్టీ స్టారర్‌?

11 March 2018-12:00 PM

విక్టరీ వెంకటేష్‌, రానా కాంబినేషన్‌లో ఓ భారీ మల్టీ స్టారర్‌ తెరక్కెబోతోందంటూ ఎప్పటి నుండో వార్తలు వస్తున్నాయి. అయితే ఆ టాక్‌ ఇప్పుడు కార్యరూపం దాల్చనున్నట్లు తెలుస్తోంది. ఓ ప్రముఖ దర్శకుడు ఈ మల్టీస్టారర్‌ని తెరకెక్కించబోతున్నాడనీ సమాచారమ్‌. అందుకోసం తెర వెనుక ఏర్పాట్లు కూడా జోరుగా జరుగుతున్నాయట. 

బాబాయ్‌ - అబ్బాయ్‌ కలిసి గతంలో ఓ సినిమాలో నటించారు. క్రిష్‌ దర్శకత్వంలో రానా హీరోగా వచ్చిన 'కృష్ణం వందే జగద్గురుమ్‌' చిత్రంలో వెంకటేష్‌ గెస్ట్‌ రోల్‌లో కనిపిస్తాడు. ఓ పాటలో వెంకీ, రానాతో కలసి స్టెప్పులేస్తాడు. అయితే ఇప్పుడు రాబోతున్న మల్టీస్టారర్‌లో ఇద్దరివీ ఫుల్‌ లెంగ్త్‌ క్యారెక్టర్సట. మాస్‌ ఎంటర్‌టైనర్‌గా ఆ సినిమా తెరకెక్కనుందట. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించి మరిన్ని పూర్తి వివరాలు చిత్ర యూనిట్‌ ప్రకటించనుంది. 

ఈ సినిమాను సురేష్‌ ప్రొడక్షన్స్‌లో ప్రముఖ నిర్మాత సురేష్‌ బాబు నిర్మించనున్నారనీ తెలుస్తోంది. ప్రస్తుతం రానా ఇటు తెలుగు, హిందీ భాషల్లో వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. మరోవైపు వెంకటేష్‌ 'గురు' సినిమా తర్వాత లాంగ్‌ గ్యాప్‌ తీసుకున్నాడు. మొన్నీ మధ్యనే పవర్‌ స్టార్‌ పవన్‌కళ్యాణ్‌ 'అజ్ఞాతవాసి'లో ఓ గెస్ట్‌ రోల్‌లో కనిపించాడు. అయితే ఆ సినిమా సక్సెస్‌ కాకపోవడంతో వెంకీ క్యారెక్టర్‌ కూడా హైలైట్‌ కాలేదు. 

దీని సంగతిటుంచితే, వెంకీ హీరోగా తేజ దర్శకత్వంలో ఓ సినిమాకి కమిట్‌ అయ్యాడు. 'ఆటా నాదే వేటా నాదే' అనే టైటిల్‌ని ఈ సినిమాకి పరిశీలిస్తున్నారు. ఈ సినిమాలో ముద్దుగుమ్మ శ్రియ, వెంకీతో జత కడుతోంది.

 

ALSO READ: దయచేసి అలాంటి కథలు చెప్పకండి: రశ్మి