రీమేక్ చిత్రాలను ఎక్కువగా ఇష్టపడుతుంటారు వెంకటేష్. అందులోనూ ఈ మధ్య వెంకటేష్ రీమేక్ చిత్రాలపైనే ఎక్కువగా దృష్టి పెట్టినట్లు కనిపిస్తోంది. అందులో భాగంగా తెరకెక్కిన 'దృశ్యం', 'గురు' చిత్రాలతో వెంకీ ది స్పెషల్ హిట్స్ అందుకున్నారు. అలాగే ఇప్పుడు వెంకీ మళ్లీ మరో రీమేక్‌పై కన్నేసినట్లు తెలుస్తోంది. తమిళంలో ఘన విజయం సాధించిన 'విక్రమ్ వేధ' సినిమాని తెలుగులో రీమేక్ చేసే యోచనలో వెంకీ ఉన్నట్లు సమాచారమ్. చాలా కాలంగా ఈ రీమేక్‌పై ఆలోచన చేస్తున్నారట వెంకటేష్.
తమిళంలో మాధవన్, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రం మంచి విజయం అందుకుంది. క్రైం థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో మాధవన్ ఎన్‌కౌంటర్ స్పెషలిస్టుగానూ, విజయ్ సేతుపతి గ్యాంగ్‌స్టర్ పాత్రలోనూ నటించారు. వీరిద్దరికీ మంచి పేరు తీసుకొచ్చిందీ సినిమా. ఈ సినిమా స్టోరీ వెంకీని చాలా ఇంప్రెస్ చేసిందట. దాంతో ఈ సినిమాలో తాను నటించాలని అనుకున్నారట. అయితే ఇది మల్టీ స్టారర్‌గా రూపొందాల్సిన చిత్రం. సో అందుకే ఈ ప్రాజెక్ట్ అనుమానంలో పడిందట. అయితే ఈ మధ్య బాబాయ్ - అబ్బాయ్ మల్టీ స్టారర్ అంటూ ప్రచారం మళ్లీ తెరపైకొచ్చింది. దాంతో ఈ ప్రాజెక్ట్‌నే దగ్గుబాటి మల్టీస్టారర్‌గా తెరకెక్కిస్తే ఎలా ఉంటుందని ఆలోచన చేస్తున్నారట. త్వరలోనే క్లారిటీ రానుందీ విషయంలో.
ఇకపోతే, ఆల్రెడీ భళ్లాలదేవుడిగా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించి మెప్పించిన రానా ఈ సినిమాలో గ్యాంగ్‌స్టర్ పాత్రలోనూ, ఎన్‌కౌంటర్ స్పెషలిస్టుగా పవర్‌ఫుల్ పోలీసాఫీసర్ పాత్రలో వెంకీ కనిపించబోతున్నారనే టాక్ టాలీవుడ్‌లో వినిపిస్తోంది. మరోపక్క రానా ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉండగా, తేజ డైరెక్షన్‌లో వెంకటేష్ 'ఆటా నాదే వేటా నాదే' సినిమాలో నటిస్తున్నారు.
ALSO READ: 'రంగస్థలం'కి షాకిచ్చిన గొల్లభామ!