ఇళయతళపతి అనే స్క్రీన్ నేమ్ తో పాపులర్ అయిన తమిళ హీరో విజయ్ కి ఇప్పుడు మరొక కొత్త బిరుదు వచ్చింది.
అదేంటంటే - సామ్రాట్ అఫ్ సౌత్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ అనే టైటిల్ ని బిహైండ్ వుడ్స్ గోల్డ్ మెడల్స్ ఈవెంట్ వారు విజయ్ కి ఇచ్చి సత్కరించారు. ఈ ఈవెంట్ ఆదివారం చెన్నైలో జరిగింది, ఈ టైటిల్ ని అన్ లైన్ ఓటింగ్ పద్దతి ద్వారా ఎంపిక చేసారు, ఈ ఓటింగ్ లో విజయ్ కి 66% ఓట్లు లభించాయి.
అలాగే విజయ్ ని పోలిన మైనపు విగ్రహాన్ని కూడా ఆయన చేతే ఆవిష్కరింపచేశారు. ఈ విగ్రహాన్ని లోనావాలా లోని సెలబ్రిటీస్ వ్యాక్స్ మ్యూజియంలో ప్రదర్శనకు పెట్టనున్నారు.
ALSO READ: పవన్ సినిమా పై వస్తున్న పుఖార్ల మీద క్లారిటీ