ENGLISH

ఎన్టీఆర్ కోసం అప్పుడే క‌ర్చీఫ్ వేసేశారా?

15 June 2021-13:00 PM

స్టార్ హీరోలెవ‌రూ ఖాళీగా లేరు. త‌మ డైరీలు రెండు మూడేళ్ల వ‌ర‌కూ ఫుల్ అయిపోయాయి. ఎన్టీఆర్ ప్లానింగ్ కూడా ప‌క్కాగా ఉంది. ఆర్‌.ఆర్‌.ఆర్ అయిపోయిన వెంట‌నే కొర‌టాల శివ సినిమా మొద‌ల‌వుతుంది. ఆ వెంట‌నే.. ప్ర‌శాంత్ నీల్ సినిమా ప‌ట్టాలెక్కుతుంది. అయితే ఈలోగానే.. ఈ సినిమాకి సంబంధించి ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ మొద‌లైపోయింది. విల‌న్ గా విజ‌య్ సేతుప‌తిని బుక్ చేసేసిన‌ట్టు స‌మాచారం. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీస్‌సంస్థ నిర్మిస్తోంది. మైత్రీలో ఇప్ప‌టికే..`ఉప్పెన‌` చేశాడు విజ‌య్ సేతుప‌తి.

 

`పుష్ష‌` కోసం కూడా విజ‌య్ సేతుప‌తిని సంప్ర‌దించారు. కానీ.. త‌న‌కు ఈసినిమా చేయ‌డం కుద‌ర్లేదు. అప్పుడు ఇచ్చిన అడ్వాన్స్‌తోనే... ఎన్టీఆర్ సినిమాకి విజ‌య్ ని ఫిక్స్ చేశార‌ని స‌మాచారం. 2022 న‌వంబ‌రులో ఎన్టీఆర్ - ప్ర‌శాంత్ నీల్ సినిమా ప‌ట్టాలెక్కుతుంది. అప్ప‌టికి ఇంకా చాలా స‌మ‌యం ఉంది. అయితే విజ‌య్ సేతుప‌తి చాలా బిజీ ఆర్టిస్ట్‌. అప్ప‌టిక‌ప్పుడు... సేతుప‌తి డేట్లు దొర‌క్క‌పోవొచ్చు. అందుకే ముందుగానే బ్లాక్ చేసిపెట్టుకున్నార‌న్న‌మాట‌.

ALSO READ: గుడ్ న్యూస్‌: ఏపీలో థియేట‌ర్లు తెర‌చుకున్నాయ్‌!