ENGLISH

సైరా కోసం వస్తున్న తమిళ హీరో...

12 March 2018-17:17 PM

మెగాస్టార్ చిరంజీవి సైరా చిత్ర షూటింగ్ ప్రస్తుతం రెండవ షెడ్యూల్ లో ఉంది. ఇక ఈ షెడ్యూల్ నుండి ఏకదాటిగా చిత్ర షూటింగ్ జరిపేందుకు మొత్తం యూనిట్ ప్రణాలికలు సిద్ధం చేసింది. 

ఇక ఈ సినిమాలో ఒక ముఖ్యపాత్ర పోషించడానికి తమిళ హీరో సేతుపతి రేపు హైదరాబాద్ రానున్నాడు. రేపటి నుండి జరగబోయే షూటింగ్ లో ఆయన పూర్తి స్థాయిలో పాల్గొనబోతున్నట్టు సమాచారం. ఇదే విషయాన్నీ ఆయన తన ట్విట్టర్ ద్వారా అందరితో పంచుకున్నాడు.

ఈ షెడ్యూల్ లో లెజెండరీ యాక్టర్ అమితాబ్ బచ్చన్ కూడా పాల్గొననున్నట్టు ఇప్పటికే సమాచారం ఉంది. దీనితో ఈ షెడ్యూల్ లో సినిమాకి సంబందించిన కీలక భాగాన్ని షూట్ చేయనున్నట్టుగా తెలుస్తున్నది. 

మరిన్ని విషయాలు ఇంకొన్ని రోజుల్లో తెలిసే అవకాశాలు ఉన్నాయి.

 

ALSO READ: అసభ్యమైన కామెంట్ కి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన నటి