ENGLISH

మొన్న ఖుష్భు ఇప్పుడు విజయశాంతి?

13 November 2020-16:00 PM

ప్రజాదరణ పొందిన సినీతారలు.. వాళ్ళని అంతలా ఆదరించిన ప్రజలకు ఎంతో కొంత సేవ చేద్దామనే ఉద్దేశంతో.. వాళ్ళ కెరీర్ ని పణంగా పెట్టి కొంతమంది రాజకీయాల్లోకి ప్రవేశిస్తుంటారు. జనాకర్షణ వీళ్ళకి అధికంగా ఉండడం వల్ల ఇలాంటి తారలను స్టార్ క్యాంపైనర్ గా ఉపయోగించుకుంటారు. మొదట ఒక పార్టీలో చేరి, వారి సిద్ధాంతాలు నచ్చకో.. వారి పొలిటికల్ పొజిషన్ నచ్చకో ఆ పార్టీ నుండి ఇంకో పార్టీకి మారుతూ ఉంటారు. మన సౌత్ హీరోయిన్స్ లో ఇది చాలా కామన్.

 

తమిళనాడు నుండి హీరోయిన్ 'ఖుష్భు' ఎప్పటి నుండో కాంగ్రెస్ పార్టీ లో సిన్సియర్ గా పనిచేసింది. మోడీని, మోడీ ప్రభుత్వాన్ని అవకాశం దొరికినప్పుడల్లా ఏకిపారేసింది. మరి ఇంతలో ఏమైందో కానీ ఇప్పుడు అకస్మాత్తుగా బీజేపీ లో చేరి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇప్పుడు ఈ లిస్ట్ లో మన రాములమ్మ కూడా చేరబోతున్నట్టు విశ్వసనీయ సమాచారం. విజయశాంతి మొదట బీజేపీ నుండి కాంగ్రెస్ పార్టీ లో చేరింది. తన వాగ్ధాటి తో చాలా ఏళ్ళు స్టార్ క్యాంపైనర్ గా కాంగ్రెస్ పార్టీ తరుపున ప్రచారం చేసింది. అయితే ఇప్పుడు విజయశాంతి కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పనుందట.

 

ఎప్పటి నుండో విజయ్ శాంతి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని మార్చాలని, బలమైన నాయకత్వమే ఆ పార్టీని ముందుకు తీసుకుపోగలదని పార్టీ పెద్దలను చాలాసార్లు వేడుకుంది. చివరికి ఫలితం లేక కాంగ్రెస్ ని వీడి బిజెపి లో చేరాలని నిర్ణయం తీసుకుంది. మరి రాములమ్మ పార్టీని వీడడానికి కారణమేంటో, కాషాయం కండువ ఎప్పుడు వేసుకోనుందో చూడాలి.

ALSO READ: నాని, వివేక్ ఆత్రేయ‌, మైత్రి మూవీ మేక‌ర్స్ కాంబినేష‌న్‌లో 'నాని28'