ఎందుకో అక్కినేని ఫ్యామిలీ అంటే విక్రమ్ కె.కుమార్ కి చాలా ఇష్టం. తన కెరీర్లో చాలా తక్కువ సినిమాలే ఉన్నా, అందులో ఎక్కువ భాగం అక్కినేని హీరోలతోనే చేశాడు. మనం, హలో, ఇప్పుడు `థ్యాంక్యూ` ఇలా.. హ్యాట్రిక్ కొట్టాడు. ఇప్పుడు నాగచైతన్యతో ఓ వెబ్ సిరీస్ చేయబోతున్నాడట. అమేజాన్ ప్రైమ్ కోసం ఓ వెబ్ సిరీస్ చేయడానికి విక్రమ్ కె.కుమార్ ఒప్పందం కుదుర్చుకున్నాడు. అందుకోసం అమేజాన్ ఏకంగా 25 కోట్లు కేటాయించిందని సమాచారం.
8 భాగాలుగా సాగే ఈ వెబ్ సిరస్ హారర్ జోనర్లో సాగబోతోందట. ఇందులో కథానాయకుడిగా నాగచైతన్య నటించబోతున్నాడు. ఇప్పటికే కథ ఓకే అయిపోయింది. థ్యాంక్యూ సినిమా ముగిసిన వెంటనే ఈ హారర్ వెబ్ సిరీస్ పట్టాలెక్కబోతోంది. సమంత `ది ఫ్యామిలీమెన్`తో వెబ్ సిరీస్ ప్రపంచంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు నాగచైతన్య వంతు వచ్చింది. విక్రమ్ కె.కుమార్ దర్శకుడు కావడం, అమేజాన్ ఈ వెబ్ సిరీస్ కి భారీ బడ్జెట్ కేటాయించడంతో నాగచైతన్య కూడా సరే అనక తప్పలేదు. ఈ వెబ్ సిరీస్‌కి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో తెలుస్తాయి.
ALSO READ: భగత్ సింగ్ గా పవన్ కల్యాణ్?!