ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ విశాల్ ధద్లాని తన భార్య నుండి విడాకులు కోరబోతునట్టుగా తెలుస్తుంది.
అందుతున్న వివరాల ప్రకారం, విశాల్ చాలా కాలం నుండే తన భార్యతో కాకుండా విడిగా ఉంటున్నాడు. అయితే విడాకుల తీసుకోబోతున్నారు అని వార్తలు వెలువడుతున్న నేపధ్యంలో, విశాల్ ఈ వార్తల పై స్పందించాడు. విడాకుల మాట వాస్తవమేనని అయితే వారు ఇరువురు వేరుగానే ఉంటున్నామని ఇక ఇప్పుడు డివోర్స్ కి అప్లై చేయడం జస్ట్ ఫార్మాలిటీ అని స్పష్టం చేసాడు.
అయితే ఈ నిర్ణయం ఇద్దరు కలిసి తీసుకున్నదే అని చెప్పాడు. ఇప్పటికి ప్రియాలి తనకు ఒక మంచి స్నేహితురాలే అని తెలిపాడు.
ఈ 2017 సంవత్సరంలో సెలబ్రిటీస్ లో విడిపోతున్న మొదటి జంట వీరే!
ALSO READ: Second Day Health Bulletin of Dasari Narayana Rao