ENGLISH

సమ్మర్ రేసు నుంచి స్టార్ హీరోలు అవుట్

08 March 2025-21:16 PM

టాలీవుడ్ లో మోస్ట్ అవెయిటెడ్ ప్రాజెక్ట్స్ అన్నీ ఒక్కో సందర్భానికి వస్తుంటాయి. కొత్త ఏడాది లో మొదట సంక్రాంతి పండగతో సినిమా ఉత్సవం మొదలవుతుంది. తరువాత వచ్చిన సినిమాలు మాములుగా ఉన్నా నెక్స్ట్ సమ్మర్ సీజన్ లో గట్టి పోటీ ఉంటుంది. స్టార్ హీరోలు , దర్శకులు, హై బడ్జెట్ సినిమాలు సమ్మర్ బరిలో నిలిచేందుకు ఆసక్తి చూపుతాయి. ఈ ఏడాది సంక్రాంతికి 'గేమ్ చేంజర్' తో రామ్ చరణ్, 'డాకు మహారాజ్' తో బాలయ్య , 'సంక్రాంతికి  వస్తున్నాం' సినిమాతో వెంకటేష్ సినిమాలు సంక్రాంతి బరిలో నిలచి మూడు హిట్ అయ్యాయి. నెక్స్ట్ వచ్చే సమ్మర్ సీజన్ కి ఎవరెవరు వస్తున్నారు, ఏవి హిట్స్ అని ఫాన్స్ ఎదురుచూస్తున్నారు. 


ఎక్జామ్స్ అయిపోయి అంతా సెలవుల హడావిడిలో ఉంటారు, పిల్లలకోసం పెద్దవాళ్ళు కూడా థియేటర్స్ కి రావాల్సి ఉంటుంది. దీంతో సమ్మర్ వసూళ్లపై అందరికీ పూర్తి ధీమా. సమ్మర్ లో వచ్చే చిన్న సినిమాలు కూడా బాగా హిట్ అవుతాయి. కలక్షన్స్ కి డోకా ఉండదు అందుకే సమ్మర్ పోటీ ఎక్కువగా ఉంటుంది. ఈసారి చిరంజీవి, ప్రభాస్, పవన్ కళ్యాణ్ సమ్మర్ ని హీట్ ఎక్కిస్తారు అనుకున్నారు. కానీ వీరి రాక డౌట్ అని తెలుస్తోంది. ఫాన్స్ కి ఈ వార్త కొంచెం నిరాశ నింపినా ఫుల్ ట్రీట్ ఇవ్వటానికే ఇలా వాయిదా వేసుకుంటున్నారని సమాచారం.  


మెగా స్టార్ చిరంజీవి విశ్వంభర మూవీ సంక్రాతి బరిలో నిలవాల్సి ఉండగా గేమ్ చేంజర్ కోసం పక్కకి తప్పుకున్నారు. ఈ క్రమంలో  సమ్మర్ బరికి కర్చీఫ్ వేశారు చిరు. కానీ ఇప్పుడు సమ్మర్ నుంచి ఆగస్టు కి వెళ్లిపోయారట. కారణం ఇంకా  కొంచెం వర్క్ పెండింగ్ ఉందని, ఆగస్టు అయితే చిరు బర్త్ డే కూడా కావటంతో ఫాన్స్ కి మంచి ట్రీట్ ఇచ్చినట్లు ఉంటుంది అని  అప్పుడు రానున్నారని తెలుస్తోంది. ప‌వ‌న్ క‌ల్యాణ్ మోస్ట్ అవైటెడ్ మూవీ 'హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు' మార్చి 28న రిలీజ్ అని మేకర్స్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే . కానీ పవన్ బిజీ షెడ్యూల్ వలన ఈ మూవీ కూడా పోస్ట్ ఫోన్ అయ్యి జూన్‌ లో వచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.  


ప్రభాస్ గత ఏడాది కల్కి మూవీతో అలరించాడు. ఈ ఏడాది 'రాజాసాబ్' మూవీతో ఏప్రిల్ లో రావాల్సి ఉండగా జూలై కి పోస్ట్ ఫోన్ అయినట్లు తెలుస్తోంది. కారణం ప్రభాస్ ఈ మధ్య గాయపడి బెడ్ రెస్ట్ లో ఉండటమే. దీంతో ఇంకా రెండు పాట‌లు, కొంత టాకీ వ‌ర్క్ మిగిలి ఉంది. జూలై కి కూడా డౌట్ అని కొందరి అభిప్రాయం. మొత్తానికి సమ్మర్ లో టఫ్ ఫైట్ ఉంటుంది అనుకున్న ఈ మూడు పెద్ద సినిమాలు ఇప్పుడు వాయిదా పడ్డాయి. పెద్ద సినిమాలు రాక ఆగిపోవటంతో చిన్న సినిమాలకి పండగ అని చెప్పాలి. మార్చ్, ఏప్రిల్ చిన్నబోయినా మే లో విజయ్ దేవర కొండ , నాని, సూర్య పోటీ ఉంది.