ENGLISH

అంధుడైనా కానీ మాస్‌ రాజా మ..మ..మాస్‌!

07 October 2017-16:43 PM

మాస్‌ రాజా రవితేజ హీరోగా తెరకెక్కుతోన్న తాజా చిత్రం 'రాజా ది గ్రేట్‌'. రెండేళ్ల గ్యాప్‌ తర్వాత రవితేజ నుండి వస్తోన్న చిత్రమిది. రవితేజ అంధుడిగా నటిస్తున్నాడు ఈ సినిమాలో. అంధుడి పాత్ర అయినప్పటికీ, ఎక్కడా తగ్గడం లేదు రవితేజ. ఎనర్జీ లెవల్స్‌ ఇంకా రెట్టింపయ్యాయే కానీ, అస్సలేమాత్రం తగ్గలేదు. అంధుడి పాత్రలో రవితేజ చేస్తున్న ఫీట్స్‌ ఫ్యాన్స్‌ని ఉర్రూతలూగించేస్తున్నాయి. రవితేజ నుండి ఫ్యాన్స్‌ కోరుకునేదిదే. ఆయన ఏ గెటప్‌లో ఉన్నా సరే, ఆయన నుండి ఎనర్జీనే కోరుకుంటారు ఫ్యాన్స్‌. టైమింగ్‌ కామెడీ, కిక్కెక్కించే డైలాగ్స్‌, యాక్షన్‌ ఇంతే ఆయన నుండి ఫ్యాన్స్‌ కోరుకునేవి. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రమిది. ఆధ్యంతం వినోదాత్మకంగా సాగే చిత్రమిది. తాజాగా వచ్చిన ట్రైలర్‌ సినిమాపై అంచనాల్ని పెంచుతోంది. 'నా బిడ్డ లోకాన్ని చూడలేకపోయినా లోకానికి వాడేంటో తెలియాలి..' అంటూ తల్లి పాత్రలో రాధిక చెప్పే డైలాగ్‌ ఎమోషనల్‌ టచ్‌ ఇస్తోంది. ముద్దుగుమ్మ మెహరీన్‌ ఈ సినమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. మెహరీన్‌ కొంచెం బొద్దుగా కనిపిస్తోంది ఈ సినిమాలో అయినా కానీ ముద్దుగానే ఉంది. లొకేషన్స్‌, కథా, కథనాలు కొత్తగా అనిపిస్తున్నాయి ట్రైలర్‌ చూస్తుంటే, త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 'రాజా ది గ్రేట్‌' యాప్ట్‌ టైటిల్‌ అంటూ బ్యాక్‌ గ్రౌండ్‌లో వచ్చే డైలాగ్‌తో వెల్‌కమ్‌ టు మై వరల్డ్‌ అంటున్నాడు మాస్‌ రాజా రవితేజ.

ALSO READ: చిత్రలేఖలో ఈ యాంగిల్‌ కూడా ఉందా?