ENGLISH

రాజ‌మౌళిని రీప్లేస్ చేసేదెవ‌రు?

17 November 2020-09:42 AM

తెలుగు సూప‌ర్ హిట్ సినిమా `ఛ‌త్ర‌ప‌తి` ఎట్ట‌కేల‌కు బాలీవుడ్ వెళ్తోంది. ప‌దిహేనేళ్ల త‌ర‌వాత ఈ సినిమాని హిందీలో రీమేక్ చేయ‌డానికి ఓ అగ్ర నిర్మాణ సంస్థ ముందుకు వ‌చ్చింది. హీరోగా బెల్లంకొండ సాయి శ్రీ‌నివాస్ ని ఎంచుకున్నారు. జ‌న‌వ‌రి నుంచి ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లాలి. అయితే ఇప్ప‌టి వ‌ర‌కూ ద‌ర్శ‌కుడు ఎవ‌ర‌న్న‌ది తేల‌లేదు. ఆ ఛాన్స్ సుజిత్ కి ఎక్కువ‌గా ఉంద‌ని తెలుస్తోంది. `సాహో` తెలుగులో... అంత‌గా ఆడ‌క‌పోయినా... బాలీవుడ్ లో మాత్రం మంచి వ‌సూళ్ల‌ని అందుకుంది. పైగా `ఛ‌త్ర‌పతి` రీమేక్ కి ఓ ద‌క్షిణాది ద‌ర్శ‌కుడినే తీసుకోవాల‌ని బాలీవుడ్ నిర్మాణ సంస్థ భావిస్తోంది.

 

ఒక వేళ‌.. సుజిత్ ఈ సినిమా రీమేక్ కి సిద్ధంగా లేని ప‌క్షంలో.. ఆ ఛాన్స్ ప్ర‌భుదేవాకి ద‌క్కే అవ‌కాశం ఉంద‌ని స‌మాచారం. ద‌క్షిణాదిన ముఖ్యంగా తెలుగులో సూప‌ర్ హిట్ అయిన పోకిరి, విక్ర‌మార్కుడు లాంటి సినిమాల్ని ప్ర‌భుదేవానే బాలీవుడ్ లో రీమేక్ చేశాడు. అందుకే.. ప్ర‌భుదేవా వైపు మొగ్గు చూపొచ్చు. క‌థానాయిక కూడా... టాప్ బాలీవుడ్ స్టారే ఉండే అవ‌కాశాలున్నాయి. ఏదేమైనా.. బెల్లంకొండ‌కు బాలీవుడ్ లో అదిరిపోయే లాంచింగే ల‌భించ‌బోతోంది.

ALSO READ: అఖిల్‌ కలపాల్సిన పులిహోర చాలానే వుందట