ENGLISH

వర్మ రిటైర్‌మెంట్‌ పై హాట్ కామెంట్స్ చేసిన రాధిక

16 March 2018-12:30 PM

సంచలన దర్శకుడు వర్మలాగే ఆయన పరిచయం చేసిన ముద్దుగుమ్మ రాధికా ఆప్టేకి కూడా సంచలనాలు, వివాదాలు అంటే చాలా ఇష్టం. ఎప్పుడే ఏదో ఒక రకంగా వివాదాలతో సావాసం చేస్తూ ఉంటుందీ హాట్‌ బ్యూటీ. అయితే తాజాగా అమ్మడిని నటులు, దర్శకుల్లో ఎవరి రిటైర్‌మెంట్‌ ప్రకటిస్తే బావుంటుందని మీరు భావిస్తున్నారు అని ప్రశ్నిస్తే, రాధికా ఆప్టే, రామ్‌గోపాల్‌ వర్మ పేరు చెప్పిందట. అంతా షాకయ్యారు ఆమె సమాధానానికి. 'రక్త చరిత్ర' సినిమాతో రాధికా ఆప్టేని తెలుగు తెరకు పరిచయం చేసింది రామ్‌గోపాల్‌ వర్మనే.

అలాంటిది ఆయన రిటైర్‌మెంట్‌ కోరుకోవడం వెనుక ఈ ముద్దుగమ్మ ఆంతర్యమేంటో, ఆమెకే తెలియాలి. సౌత్‌లో ఓ టాప్‌ హీరో తనని లైంగికంగా వేధించాడంటూ ఎప్పటికప్పుడే హాట్‌ హాట్‌గా వార్తల్లో నిలవాలనుకుంటుంది ఈ బ్యూటీ. తనకెప్పుడు గుర్తొస్తే, అప్పుడు ఈ కాస్టింగ్‌ కౌచ్‌ పేరు చెప్పి, ఈ మాట తలవకుండా ఉండదు రాధికా ఆప్టే. అలాంటిదిప్పుడు వర్మ రిటైర్‌మెంట్‌పై హాట్‌ హాట్‌ కామెంట్స్‌ చేసి, మరోసారి హాట్‌ టాపిక్‌ అయ్యింది.

ప్రస్తుతం తెలుగులో సినిమాలు చేయడం లేదు. కానీ, ఈ ముద్దుగుమ్మ సినిమాల్లో నటించినా సెన్సేషనే. నటించకపోయినా సెన్సేషనే. ఆ మధ్య ఓ హిందీ సినిమాలో న్యూడ్‌ సీన్‌లో నటించి ఎంత వివాదాస్పదమైందో తెలిసిన సంగతే. ప్రస్తుతం హిందీ, తమిళ చిత్రాలతో పాటు, ఓ ఇంగ్లీష్‌ సినిమాలో కూడా నటిస్తోంది రాధికా ఆప్టే.

ALSO READ: హాట్‌ అండ్‌ స్పైసీ అందాల పియా