ENGLISH

చ‌ద్ద‌న్నం.. గంజినీళ్లు

17 June 2021-15:33 PM

బ్యాక్ టూ రూట్స్ అంటోంది ప్ర‌స్తుత ప్ర‌పంచం. మ‌నం దేన్న‌యితే వ‌దిలేశామో... మ‌ళ్లీ ఇప్పుడు అదే ఫ్యాష‌న్ అయి కూర్చోంది. చ‌ద్ద‌న్నం తింటే... అనారోగ్యాలు ద‌రి చేర‌వ‌ని, అంత‌కు మించిన ఔష‌ధం లేద‌ని ఇప్పుడు డాక్ట‌ర్లు డంకా బ‌నాయించి చెబుతున్నారు. కొన్ని హోటెల్స్ త‌మ మెనూలో చ‌ద్ద‌న్నంని కూడా చేర్చేశారు. `నాకూ చ‌ద్ద‌న్న‌మే ఇష్టం` అంటోంది యామీ గౌత‌మ్.

 

తెలుగు వాళ్లు యామీని పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు గానీ, బాలీవుడ్ మాత్రం మంచి ఆఫ‌ర్లిచ్చి.. ప్రోత్స‌హించింది. అక్క‌డ ఏదో ఓ సినిమా చేస్తూ బిజీగా ఉంటోంది యామీ. ఈమ‌ధ్య త‌న గ్లామ‌ర్ ర‌హ‌స్యం చెబుతూ ``చ‌ద్ద‌న్నం తింటాను. గంజి నీళ్లు తాగుతాను. అవే న‌న్ను ఆరోగ్యంగా ఉండేలా చేస్తున్నాయి. నా అందానికీ కార‌ణం అవే..`` అని చెప్పుకొచ్చింది. మ‌న‌మూ పాటిస్తే పోలా..? అందానికి అందం, ఆరోగ్యానికి ఆరోగ్యం.

ALSO READ: Yami Gautam Latest Photoshoot