ENGLISH

హాట్‌ యామీ అందాల సునామీ

10 March 2018-11:49 AM

తెలుగులో 'గౌరవం' తదితర చిత్రాల ద్వారా సుపరిచితురాలు ముద్దుగుమ్మ యామీ గౌతమ్‌. అంతకన్నా ముందే ఈ భామ వాణిజ్య ప్రకటనల ద్వారా కూడా అత్యంత పరిచయస్తురాలే. అయితే తెలుగులో సినిమాల ద్వారా అంతగా పాపులర్‌ కాలేదు కానీ, హిందీలో హృతిక్‌ రోషన్‌తో చేసిన 'కాబిల్‌' సినిమా బాక్సాఫీస్‌ వద్ద మంచి హిట్‌ సొంతం చేసుకోవడంతో పాటు, నటిగా యామీ గౌతమ్‌కి మంచి పేరు తీసుకొచ్చింది. తెలుగు, హిందీతో పాటు, తమిళ, మలయాళ తదితర భాషల్లో కూడా ఈ ముద్దుగుమ్మ నటించింది. ప్రస్తుతం హిందీలో సినిమాలు చేస్తోంది. అప్పుడప్పుడూ ఇలా సోషల్‌ మీడియాలో తళుక్కున మెరుస్తూ ఉంటుంది. తాజాగా ఈ బ్యూటీ ఓ ఫోటో షూట్‌కి ఇచ్చిన పోజులో ఈ ఫోటో అందర్నీ విశేషంగా ఎట్రాక్ట్‌ చేస్తోంది. స్కై బ్లూ డ్రెస్‌లో ఫ్రెష్‌ ఫేస్‌తో చేతిలో ఫోన్‌తో వెనక్కి బెడ్‌పై కూర్చుని వెనక్కి తిరిగి చూస్తున్నట్లుగా ఉన్న యామీ గౌతమ్‌ లుక్స్‌ సింప్లీ సూపర్బ్‌గా ఉన్నాయి.

ALSO READ: విజయశాంతి తర్వాత నయనతారేనేమో!