ENGLISH

డేరా బాబా ఆధ్వర్యంలో బిగ్ బాస్ హౌస్!

23 September 2017-11:19 AM

అత్యాచారం కేసులో శిక్ష పడి ప్రస్తుతం జైలు జీవితం గడుపుతున్న డేరా బాబా గతంలో చేసిన పనులన్నీ ఒక్కొకటిగా బయటకివస్తున్నాయి.

 

అందులో ముఖ్యంగా ఆయన ఆశ్రమం లో జరిగిన వ్యవహారాలు సంచలనం రేపుతున్నాయి. ఆయన ప్రాధాన్ అనుచరుడు అలాగే ఆయన దత్తపుత్రికగా చెప్పుకునే హన్ప్రీత్ మాజీ భర్త విశ్వాస్ గుప్తా కొన్ని సంచలన విషయాలు బయట పెట్టాడు.

ఆ వివరాల్లోకి వెళితే- బయట బిగ్ బాస్ హౌస్ రియాలిటీ షో తరహాలోనే డేరా బాబా తన ఆశ్రమంలో ఒక 6 జంటలని 28 రోజుల పాటు ఉంచుకొని ఒక రియాలిటీ షో జరిపేవాడని చెప్పాడు. దీనితో అందరు ఒక్కసారిగా అవాక్కయ్యేలా చేసింది.

బిగ్ బాస్ హౌస్ ప్రభావం జనసామాన్యం పైనే కాకుండా ఇలా బాబాల పైన కూడా ఉండడం ఆసక్తిరేపుతుంది.

 

ALSO READ: ఇండియన్ ఆస్కార్ ఎంట్రీ న్యూటన్ మూవీ రివ్యూ & రేటింగ్స్