ENGLISH

స్వీటీతో బ్యూటీ సెల్ఫీ

29 September 2017-18:04 PM

ముద్దుగుమ్మ మెహరీన్‌ హీరోయిన్‌గా నటించిన 'మహానుభావుడు' సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మంచి రెస్పాన్స్‌ వచ్చింది ఈ సినిమాకి. శర్వానంద్‌ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కింది 'మహానుభావుడు'. కాగా ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించిన బ్యూటీ మెహరీన్‌కి అద్భుతమైన అవకాశం దక్కింది. స్వీటీ అనుష్కతో కలిసి బ్యూటీ మెహరీన్‌ 'మహానుభావుడు' సినిమా ఫస్ట్‌ షో చూసిందట. ధియేటర్‌లో అనుష్కతో సెల్ఫీ దిగి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది. ఈ ముద్దుగుమ్మకి నచ్చిన హీరోయిన్‌ ఎవరంటే అనుష్క అని చాలా సార్లు చెప్పింది. అయితే అనుష్కతో కలిసి తన సినిమా ఫస్ట్‌ షో చూస్తానని ఎప్పుడూ ఊహించలేదట. ఆ అవకాశం వచ్చినందుకు మెహరీన్‌ ఆనందం తట్టుకోలేకపోతోందట. ఆ ఆనందాన్ని ఆభిమానులతో పంచుకుని మురిసిపోతోంది. స్టార్‌ హీరోయిన్‌ అయినా కానీ అనుష్క తన తోటి హీరోయిన్స్‌తో చాలా ఫ్రెండ్లీగా మసలుతుంది. తన కన్నా సీనియర్‌ హీరోయిన్స్‌తో చాలా గౌరవంగా మెలుగుతుంది. సీనియర్స్‌ నుండి ఇంకా ఏదో నేర్చుకోవాలనే తపన అనుష్కది. అలాగే కొత్త హీరోయిన్స్‌కి తనకు తోచిన మెలకువలను అందించడంలోనూ తన సహాయ సహాకారాలు అందిస్తుంటుంది. అందుకే స్వీటీ అందరికీ స్వీటు. యంగ్‌ హీరోస్‌లో కూడా స్వీటీ అంటే అభిమానం ఉన్నవాళ్లు చాలా మంది ఉన్నారు. అదీ స్వీటీ స్పెషాలిటీ. ప్రస్తుతం అనుష్క 'భాగ్‌మతి' సినిమాలో నటిస్తోంది.

ALSO READ: బంపర్ ఆఫర్ కొట్టిన భానుమతి!