ENGLISH

'జనతా గ్యారేజ్‌'కి అవార్డుల పంట

31 March 2017-12:45 PM

గతేడాది ప్రేక్షకుల ముందుకొచ్చిన సినిమా 'జనతా గ్యారేజ్‌'. ఎన్టీఆర్‌ హీరోగా వచ్చిన ఈ సినిమాకి కొరటాల శివ దర్శకుడు. తాజాగా జరిగిన ఐఫా అవార్డుల పండగలో ఈ సినిమాకి అవార్డుల పంట పండింది. ఉత్తమ నటుడిగా కొరటాల శివకు అవార్డు దక్కింది. అలాగే ఉత్తమ నటుడి అవార్డుని ఎన్టీఆర్‌ దక్కించుకున్నాడు. ఈ అవార్డును అందుకున్న ఎన్టీఆర్‌ చాలా ఆనందం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్‌ కెరీర్‌లోనే బెస్ట్‌ మూవీగా నిలిచింది ఈ సినిమా. సక్సెస్‌ పరంగానూ, వసూళ్ల పరంగానూ కూడా ఈ సినిమా ఉత్తమ స్థానాన్ని దక్కించుకుంది. ఈ అవార్డు ఫంక్షన్‌లో ఎన్టీఆర్‌ లుక్‌ అందర్నీ ఎట్రాక్ట్‌ చేసింది. కొత్త సినిమా కోసం కొత్త లుక్‌లో ఎన్టీఆర్‌ బాగున్నాడు. అలాగే ఈ అవార్డు ఫంక్షన్‌లో ఎన్టీఆర్‌, సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబుని ఉద్దేశించి, మహేష్‌ చాలా అందగాడు అని అభివర్ణించడం విశేషం. మొత్తం 6 అవార్డుల్ని ఐఫా ఉత్సవంలో ’జనతా గ్యారేజ్‘ సినిమా అందుకుంది. ప్రస్తుతం ఎన్టీఆర్‌, బాబీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. 'జై లవ్‌ కుశ' అనే టైటిల్‌ని ఈ సినిమాకి ఫిక్స్‌ చేశారు. కళ్యాణ్‌ రామ్‌ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్‌ త్రిపాత్రాభినయం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో తన గెటప్స్‌ కోసం ఎన్టీఆర్‌ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారట. నివేదా థామస్‌, రాశీఖన్నా ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తున్నారు.

ALSO READ: గురు తెలుగు మూవీ రివ్యూ & రేటింగ్స్