ENGLISH

తేజు, వరుణ్‌ - వాట్‌ ఏ 'మెగా' ఛేంజ్‌

19 January 2018-10:44 AM

'యమదొంగ' సినిమాకి ముందు యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ ఎలా ఉండేవాడు? బొద్దుగా ముద్దుగా ఉండేవాడు. రాజమౌళి ఆ బొద్దుతనాన్ని మార్చేసి, స్లిమ్‌గా ఎన్టీఆర్‌ని చూపించేశాడు. అల్లు శిరీష్‌ సినిమాల్లోకి రాకముందు చాలా బొద్దుగా ఉండేవాడుగానీ, సినిమాల్లోకొచ్చాక స్లిమ్‌ అవ్వాల్సి వచ్చింది. సినిమా అలా హీరోల్ని మార్చేస్తుంటుంది. 

మెగా హీరోలు సాయిధరమ్‌తేజ్‌, వరుణ్‌ తేజ్‌ కూడా అంతే. సినిమాల్లోకి రాకముందు చాలా చాలా బొద్దుగా ఉండేవారు. ఈ విషయాన్ని గుర్తు చేసుకుంటూ తేజు, వరుణ్‌తో ఉన్న ఒకప్పటి ఫొటోని సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు. 'వాట్‌ ఏ ఛేంజ్‌ మామా' అంటూ వరుణ్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలతోపాటు ఆల్‌ ది బెస్ట్‌ కూడా చెప్పేశాడు. ఈ ఫొటోలోని హీరోలకీ, ఇప్పుడు తెరపై కన్పిస్తున్న హీరోలకీ చాలా తేడా ఉంది.

 

ముఖ్యంగా వరుణ్‌ అయితే ఎప్పటికప్పుడు కంప్లీట్‌ మేకోవర్‌ ఛేంజ్‌తో కన్పిస్తున్నాడు. తన కొత్త సినిమా 'తొలిప్రేమ'లో అయితే ఇంతకు ముందెన్నడూ లేనంత క్లాస్‌ లుక్‌తో కన్పిస్తున్న వరుణ్‌, ఈ సినిమాతో ఇంకో విజయాన్ని తన ఖాతాలో వేసుకునేలానే ఉన్నాడు. 'తొలిప్రేమ' సినిమాలో రాశి ఖన్నా హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసినదే. సాయిధరమ్‌ తేజ ప్రస్తుతం 'ఇంటెలిజెంట్‌' మూవీలో నటిస్తున్నాడు. వినాయక్‌ ఈ చిత్రానికి దర్శకుడు. 

ఇటు తేజు, అటు వరుణ్‌ డిఫరెంట్‌ సబ్జెక్ట్స్‌ ఎంచుకుంటూ తమ కెరీర్‌లో ముందుకు సాగుతున్నారు. తేజు కెరీర్‌ ఈ మధ్య కొంత డల్‌ అయినట్లు కన్పిస్తోంటే, వరుణ్‌ మాత్రం 'ఫిదా' సక్సెస్‌తో మంచి ఊపుమీదున్నాడు.

ALSO READ: పవన్ కళ్యాణ్ కి కొత్త బిరుదు ఇచ్చిన లావణ్య త్రిపాఠి