ENGLISH

అమ్మైన బాపూ బొమ్మ‌!

11 June 2022-09:30 AM

అత్తారింటికి దారేదిలో బాపు బొమ్మ‌లా స్టెప్పులేసింది ప్ర‌ణీత‌. అంత‌కు ముందు చాలా సినిమాలు చేసినా రాని గుర్తింపు... అత్తారింటికితో ద‌క్కింది. అయితే ఆ సినిమా సూప‌ర్ డూప‌ర్ హిట్ట‌యినా త‌న‌కు పెద్ద‌గా అవ‌కాశాలు రాలేదు. దాంతో క్ర‌మంగా సైడ్ అయిపోయింది. పెళ్లి చేసుకొని, ఇప్పుడు వ్య‌క్తిగ‌త జీవితాన్ని హాయిగా గ‌డుపుతోంది. ఇప్పుడు త‌ల్లికూడా అయ్యింది.

 

శుక్ర‌వారం ఓ పండంటి ఆడ బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది. ఈ ఫొటోల్ని సోష‌ల్ మీడియాలో షేర్ చేసుకుంటూ త‌న ఆనందాన్ని పంచుకొంది. కానీ పాప మొహం చూపించ‌కుండా జాగ్ర‌త్త ప‌డింది. `పాప పుట్టిన‌ప్ప‌టి నుంచీ అంతా క‌ల‌లా క‌నిపిస్తోంది` అంటూ త‌న‌కు వైద్యం చేసిన డాక్ట‌ర్ సునీల్ అండ్ టీమ్ కి కృత‌జ్ఞ‌త‌లు తెలిపింది ప్ర‌ణీత‌. పెళ్లి చేసుకొని సినిమాల‌కు దూర‌మైన ప్ర‌ణీత‌.. ఇప్పుడు త‌ల్ల‌య్యాక‌.. మ‌ళ్లీ కెమెరా ముందుకు రావ‌డం దాదాపుగా అసాధ్యం. ప్ర‌ణీత కూడా వ్య‌క్తిగ‌త జీవితానికే ప్రాధాన్యం ఇవ్వాల‌ని నిర్ణ‌యించుకొన్న‌ట్టు తెలుస్తోంది.

ALSO READ: 'అంటే సుందరానికీ' మూవీ రివ్యూ & రేటింగ్