ENGLISH

బ్యాడ్ న్యూస్ - బన్నీ సినిమా లేద‌ట‌!

11 June 2022-11:00 AM

ఇటీవ‌ల సంజ‌య్ లీలా బ‌న్సాలీ - అల్లు అర్జున్ మ‌ధ్య ఓ భేటీ జ‌రిగింది. దాంతో.. సంజయ్ లీలా భ‌న్సాలీతో బ‌న్నీ ఓ సినిమా చేయ‌బోతున్నాడ‌న్న వార్త చ‌క్క‌ర్లు కొట్టింది. ఈ వార్త టాలీవుడ్ ని ఆశ్చ‌ర్యంలో ముంచెత్తింది. బ‌న్నీ అభిమానులు ఖుషీ చేసుకొన్నారు. బ‌న్సాలీ లాంటి వాడు బ‌న్నీని వెదుక్కొంటూ రావ‌డం, క‌లిసి క‌థ చెప్ప‌డం షాకింగ్ విష‌య‌మే. దాంతో ఈ కాంబోపై ఊహాగానాలు పెరిగిపోయాయి. ఇప్పుడు వాటికి బ్రేక్ వేశాడు బ‌న్నీ వాసు.

 

ఇటు గీతా ఆర్ట్స్‌కి, అటు అల్లు అర్జున్‌కీ వెన్నుద‌న్నుగా నిలిచే వ్య‌క్తి బ‌న్నీ వాస్‌. త‌న మాట‌, బ‌న్నీ మాట వేరు కాదు. ఇప్పుడు ఆయ‌నే `బ‌న్నీ - బ‌న్సాలీ సినిమా లేదు` అని ప్ర‌క‌టించేశారు. ''వారిద్ద‌రూ మ‌ర్యాద పూర్వ‌కంగానే క‌లుసుకొన్నారు. ఇద్ద‌రి మ‌ధ్యా సినిమా చేద్దామన్న చ‌ర్చ‌లు రాలేదు. బ‌య‌ట వ‌స్తున్న వార్త‌ల‌న్నీ ఫేక్ వార్త‌లే'' అని క్లారిటీ ఇచ్చేశాడు. గీతా ఆర్ట్స్ లో నంద‌మూరి బాల‌కృష్ణ తో సినిమా రాబోతోంద‌ని గ‌త కొంత‌కాలంగా ఓ వార్త చ‌క్క‌ర్లు కొడుతోంది. దీనిపై కూడా బ‌న్నీ వాసు మాట్లాడాడు. ''బాల‌య్య‌తో సినిమా చేయాల‌ని ఉంది. మంచి క‌థ కుదిరితే త‌ప్ప‌కుండా చేస్తాం'' అని చెప్పేశాడు.

ALSO READ: 'అంటే సుందరానికీ' మూవీ రివ్యూ & రేటింగ్