ENGLISH

నాల్గవసారి కూడా ఒకే చెప్పిన అజిత్

23 November 2017-18:49 PM

తమిళ దర్శకుడు శివ, హీరో అజిత్‌ కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలన్నీ సూపర్‌ హిట్సే. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో ఇప్పటికే 'వీరం', 'వేదాలం', 'వివేగం' చిత్రాలు వచ్చాయి. ఈ మూడు సినిమాలు సూపర్‌ డూపర్‌ హిట్స్‌గా నిలిచాయి అజిత్‌ కెరీర్‌లో. బాక్సాఫీస్‌ వసూళ్లను కొల్లగొట్టాయి. నేచురల్‌ గెటప్‌తో ఆకట్టుకున్నాడు అజిత్‌ ఈ మూడు సినిమాల్లోనూ. సరికొత్త ట్రెండ్‌ సృష్టించాడు ఈ సినిమాల్లోని తన యాక్టింగ్‌తో అజిత్‌. లవర్‌ బోయ్‌లా అమ్మాయిల మనసుల్ని కొల్లగొట్టిన అజిత్‌ ఈ సినిమాలతో తన బాడీ లాంగ్వేజ్‌, గెటప్‌ టోటల్‌గా ఛేంజ్‌ చేసేశాడు. అయినా కానీ అమ్మాయిల మనసులో అజిత్‌ ఇప్పటికీ లవర్‌ బోయే. 

కాగా తాజాగా శివ - అజిత్‌ కాంబినేషన్‌ నాలుగోసారి మరో బ్లాక్‌ బస్టర్‌కి రెడీ అవుతోంది. ఈ సినిమాకి 'విశ్వాసం' అనే టైటిల్‌ని ఫిక్స్‌ చేశారు. ఈ కాంబినేషన్‌ అంటేనే భారీగా అంచనాలుంటాయి. ఇక టైటిల్‌ విషయానికి వస్తే, సెంటిమెంట్‌ పరంగా మూడు సినిమాలకు స్టార్టింగ్‌ 'వ' లెటర్‌తో వచ్చే పదాలు, చివర సున్న..అదే సెంటిమెంట్‌ సక్సెస్‌ ఫార్ములాతో తాజా చిత్రం కూడా రాబోతోందంటేనే సినిమా పక్కా సూపర్‌ హిట్‌ అని కోలీవుడ్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అజిత్‌కి తెలుగులో కూడా ఈ మధ్య మంచి మార్కెట్‌ ఏర్పడింది. 'వివేగం' చిత్రం 'వివేకం' పేరుతో తెలుగులోనూ విడుదలై మంచి వసూళ్లు రాబట్టింది. ఇక 'వీరం' సినిమా తెలుగులో పవన్‌ కళ్యాణ్ హీరోగా 'కాటమరాయుడు' టైటిల్‌తో రీమేక్‌ అయ్యింది. 

భారీ బడ్జెట్‌తో 'వివేగం' చిత్రాన్ని నిర్మించిన సత్యజ్యోతి ఫిలిమ్స్‌ సంస్థ 'విశ్వాసం' చిత్రాన్ని కూడా నిర్మిస్తుండడం విశేషం. అంటే ఇది కూడా భారీ బడ్జెట్‌ మూవీగానే భావించొచ్చు. వచ్చే ఏడాది జనవరిలో ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ స్టార్ట్‌ కానుంది. ఇతర నటీనటులు, టెక్నీషియన్స్‌ వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి.

ALSO READ: మెంటల్ మదిలో రివ్యూ