ENGLISH

అజిత్ సినిమా షూటింగ్ లో వ్యక్తి మృతి: షాక్ లో ఫాన్స్..!

08 November 2018-12:15 PM

సూపర్ స్టార్ అజిత్ తాజా చిత్రం విశ్వాసం షూటింగ్ లో ఒక వ్యక్తి మృతి చెందిన విషయం అందరినీ విస్మయానికి గురిచేసింది.

ఆ వివరాల్లోకి వెళితే, అజిత్ విశ్వాసం చిత్రం ప్రస్తుతం పూణేలో షూటింగ్ జరుపుకుంటున్నది. అందులో భాగంగానే ఒక పాట చిత్రీకరణ జరుగుతుండగా శరవణన్ అనే ఒక డ్యాన్సర్ గుండెపోటుకి గురవ్వడం ఆ వెంటనే ఆయనని దగ్గరిలోని ఆసుపత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయినట్టు తెలిసింది.

ఈ వార్త తెలియగానే శరవణన్ పార్థివదేహాన్ని చెన్నై తరలించడానికి ఒక స్పెషల్ ఫ్లైట్ ఏర్పాటు చేసాడట అజిత్. అంతేకాకుండా ఆయన కుటుంబానికి రూ 8 లక్షల ఆర్ధిక సహాయాన్ని కూడా ప్రకటించినట్టుగా ఆయన ప్రతినిధులు తెలిపారు.

ఇది తెలిసిన ప్రతి ఒక్కరు అజిత్ చేసిన సహాయాన్ని మెచ్చుకుంటున్నారు.   

 

ALSO READ: ఆమెకు 45.. అతనికి 33.!