ENGLISH

'డీజె'కి పవన్‌ సపోర్ట్‌

03 March 2017-13:15 PM

జోష్‌ ఫుల్‌ డైరెక్టర్‌ హరీష్‌ శంకర్‌ డైరెక్షన్‌లో తెరకెక్కుతోన్న అల్లు అర్జున్‌ చిత్రం 'దువ్వాడ జగన్నాధమ్‌'. ఈ మధ్యే ఈ సినిమా టీజర్‌ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రెస్పాన్స్‌ అదిరిపోతోంది. ఇక త్వరలోనే ఈ సినిమా పాటలు అలరించనున్నాయట. ఈ మధ్య ఆడియో సింగిల్స్‌తోనే ఆడియోని మార్కెట్‌లోకి రిలీజ్‌ చేస్తున్నారు. యూ ట్యూబ్‌ వేదికగా జరుగుతోన్న ఈ సందడికి శ్రీకారం చుట్టింది మెగాస్టారే. తాజాగా సాయి ధరమ్‌ తేజ్‌ హీరోగా వచ్చిన 'విన్నర్‌' పాటలను ఒక్కోటి ఒక్కొక్క సెలబ్రిటీస్‌చే రిలీజ్‌ చేసి తేజు అదరహో అనిపించాడు. అయితే ఈ సినిమా 'దువ్వాడ జగన్నాధమ్‌' విషయానికి వస్తే, ఈ సాంగ్స్‌ని పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌తో సోషల్‌ మీడియాలో విడుదల చేయించాలనే యోచనలో బన్నీ ఉన్నట్లు సమాచారమ్‌. చాలా కాలంగా సోషల్‌ మీడియాలో బన్నీ ఫ్యాన్స్‌కీ, పవన్‌ ఫ్యాన్స్‌కీ మధ్య వార్‌ నడుస్తోంది. కొంచెం ఘాటుగానే ఈ వార్‌ నడుస్తోంది. ఈ విషయం అందరికీ తెలిసిందే. ఓ ఆడియో ఫంక్షన్‌లో పవన్‌ ఫ్యాన్స్‌పై బన్నీ చేసిన ఘాటు విమర్శలకు గానూ ఈ రకమైన వాతావరణం బన్నీని వేధిస్తోంది చాలా కాలంగా. అయితే ఈ తాజా పరిణామంతో కొంతవరకూ ఆ వార్‌ కూల్‌ అయ్యే అవకాశాలుంటాయి. ఆ రకంగా ఇది ఆహ్మానించదగ్గ పరిణామమే. ముద్దుగుమ్మ పూజా హెగ్దే ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. విడుదలైన టీజర్‌లో అమ్మడి హాట్‌ హాట్‌ అందాల ప్రదర్శన అదిరిపోతోంది. సమ్మర్‌లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 

ALSO READ: గ్లామ్‌ షాట్‌ : సెక్సీ సెక్సీ బుజ్జీమా