ENGLISH

గ్లామ్‌షాట్‌: హాట్‌ హాట్‌ అమీషా సెక్సీ హమేషా.!

31 December 2019-19:00 PM

పవన్‌ కళ్యాణ్‌ సినిమా 'బద్రి'తో తెలుగు తెరకు పరిచయమైన ముద్దుగుమ్మ అమీషా పటేల్‌, ఆ తర్వాత ఎన్టీఆర్‌తో 'నరసింహుడు' తదితర చిత్రాల్లో నటించింది. ఎంతైనా బాలీవుడ్‌ బ్యూటీ కదా.. వస్తూ వస్తూనే తనలోని హాట్‌ అప్పీల్‌ని పరిచయం చేసింది. అమ్మడి హాట్‌నెస్‌కి తెలుగు ఫ్యాన్స్‌ ఫిదా అయిపోయారు కూడా. అయితే, తెలుగులో పెద్దగా క్రేజ్‌ సంపాదించుకోలేకపోయింది. బాలీవుడ్‌లో ఓ మోస్తరు స్టార్‌డమ్‌ సంపాదించుకుంది. కానీ, ఇప్పుడు బాలీవుడ్‌లో కూడా పాపకి పెద్దగా మార్కెట్‌ లేదు.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

💖💖💖💖💖🌈🌈🌈🌈

A post shared by Ameesha Patel (@ameeshapatel9) on

వ్యవహారం ఇలా ఉండగా, ఈ మధ్య క్రేజీ ఆఫర్స్‌ కొట్టేయాలనే కసితో కసి కసిగా సోషల్‌ మీడియా మీద అందాల దాడి చేస్తోంది. అప్పుడప్పుడూ సెక్సీ సెక్సీ ఫోటోలు పోస్ట్‌ చేస్తూ కుర్రోళ్ల మతులు పోగొట్టేస్తోంది. పరిచయమున్న అందమే కదా.. ఆ హాట్‌నెస్‌ తళుకులకు నెజిన్స్‌ ఫిదా అయిపోతున్నారు. అయితే, ఆ అందాలకు అసలు సిసలు ధర పలకాలంటే, దర్శక, నిర్మాతల్ని మెప్పించాలి. అదే పనిలో ఉన్న అమీషా పటేల్‌ తాజాగా నెట్టింట్లో ఓ హాట్‌ ఫోటో పోస్ట్‌ చేసింది. బ్లాక్‌ హాట్‌ సెక్సీ పిక్‌ అది. ఫిలిం మేకర్స్‌ సంగతేమో కానీ, నెజిన్స్‌ అయితే, అమాంతం మనసు పారేసుకుంటున్నారు.

ALSO READ: Ameesha Patel Gallery