ENGLISH

వినాయక్‌ డైరెక్షన్‌లో బాలయ్య.?

19 April 2019-16:30 PM

సీనియర్‌ దర్శకుడు వినాయక్‌తో బాలయ్య ఓ సినిమాకి కమిట్‌ అయినట్లు తాజాగా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం బాలయ్య చేతిలో కొత్త సినిమాలేమీ లేవు. బోయపాటి శీనుతో సినిమా చేయాల్సి ఉంది. కానీ అంతకన్నా ముందే వినాయక్‌ కాంబినేషన్‌లో మూవీని పట్టాలెక్కించే యోచనలో ఉన్నాడట బాలయ్య. గతంలో వినాయక్‌తో బాలయ్య నటించిన 'చెన్నకేశవరెడ్డి' చిత్రం మంచి విజయం అందుకుంది. 

 

ఆ తర్వాత మళ్లీ ఈ కాంబినేషన్‌లో సినిమాకి చాలా సార్లు సన్నాహాలు జరిగాయి కానీ, కుదరలేదు. ఇన్నాళ్ల తర్వాత సెట్‌ అయిన ఈ ప్రాజెక్ట్‌ త్వరలో సెట్స్‌ పైకి వెళ్లనుందనీ సమాచారమ్‌. ఆల్రెడీ వినాయక్‌ స్క్రిప్టు పనుల్లో బిజీగా ఉన్నారట. స్టార్‌ సీనియర్‌ డైరెక్టర్‌గా పేరున్న వినాయక్‌కి 'అఖిల్‌' డిజాస్టర్‌గా మిగిలింది. తర్వాత బాస్‌ చిరంజీవితో 'ఖైదీ నెం 150' రూపొందించి బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ కొట్టి, ఇదీ తన స్టామినా అని ప్రూవ్‌ చేసుకున్నాడు. 

 

ఆ తర్వాత మళ్లీ యంగ్‌ హీరో సాయి ధరమ్‌తేజ్‌తో 'ఇంటెలిజెంట్‌' మూవీ చేసి బోర్లా పడ్డాడు. ఆ తర్వాత కానీ తత్వం బోధపడలేదు కాబోలు వినాయక్‌కి. సీనియర్స్‌తో రూపొందించిన సినిమాలే సక్సెస్‌ అందిస్తున్నాయి తనకు అనుకున్నాడో ఏమో, ఇక యంగ్‌ హీరోల జోలికి పోకుండా, సీనియర్‌ స్టార్స్‌నే పట్టుకున్నాడు. ఆ క్రమంలోనే బాలయ్య కోసం ఓ కథని ప్రిపేర్‌ చేశాడట. త్వరలోనే ఈ స్క్రిప్టుకు సంబంధించిన వివరాలు, ప్రాజెక్ట్‌కి సంబంధించిన అధికారిక ప్రకటన వెల్లడి కానున్నాయి. 

ALSO READ: ప్రభుదేవా డైరెక్షన్‌లో సాయిపల్లవి.!