ENGLISH

బాలయ్య స్ట్రేటజీ అదిరింది.!

06 July 2018-12:03 PM

ఎన్టీఆర్‌ అంటే నేను, నేనంటే ఎన్టీఆర్‌ అనేంతలా బాలకృష్ణ, ఎన్టీఆర్‌ సినిమా విషయంలో ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. నిన్న ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభమైంది. 

ఎన్టీఆర్‌ నటించిన 'మనదేశం' సినిమా షూటింగ్‌ కూడా ఇదే రోజు ప్రారంభమైంది. ఆ విషయాన్ని చిత్ర యూనిట్‌ వెల్లడిస్తూ బాలకృష్ణ గెటప్‌ను కూడా రివీల్‌ చేసింది. క్రిష్‌ రాకతో ప్రాజెక్ట్‌కి కొత్త క్రేజ్‌ వచ్చింది. అప్పటి నుండీ సినిమా ప్రమోషన్స్‌ని కొత్తగా డిజైన్‌ చేశారు. ఇది పూర్తిగా క్రిష్‌ క్రియేటివిటీనే అని అందరూ అనుకుంటున్నారు. 

మరో పక్క బాలయ్య తెర మీద తాను కనిపించకూడదనీ, పూర్తిగా ఎన్టీఆర్‌నే జనం ఇంకోసారి గుర్తు చేసుకోవాలని దర్శకుడు క్రిష్‌కి సూచించాడట. బాలకృష్ణ అంటే స్టార్‌ హీరో. అలాంటిది తెరపై బాలకృష్ణ కాకుండా ఎన్టీఆర్‌నే మనం చూడగలగాలంటే ప్రతీ సన్నివేశం అంతగా మనసుల్ని టచ్‌ చేయాలి. అలా జరిగితేనే ఎన్టీఆర్‌ బయోపిక్‌కి సార్ధకత. సినిమాకి సంబంధించి బాలకృష్ణ వేలు పెట్టి కెలికేశాడు అంటూ వస్తున్న ప్రచారం నేపథ్యంలో తాజాగా నిన్న విడుదలైన లుక్‌ ఆ సందర్భంగా ప్రేక్షకులకు బాలకృష్ణ చేసిన అప్పీల్‌ ప్రాధాన్యతను సంతరించుకుంది. 

ఏది ఏమైనా బాలయ్య స్ట్రేటజీ అదిరిందంతే.!

ALSO READ: డిజాస్టర్ మూవీస్ లో స్థానం సంపాదించిన 'అజ్ఞాతవాసి'