ENGLISH

వీరయ్యకి.. వీరసింహా టీమ్ ఆల్ ది బెస్ట్

10 January 2023-13:00 PM

వైజాగ్ లో జరిగిన ఈవెంట్ లో బాలకృష్ణ వీరసింహారెడ్డి సినిమాకి ఆల్ ది బెస్ట్ చెప్పారు మెగాస్టార్ చిరంజీవి. ''ఇన్నేళ పరిశ్రమలో ఒకే నిర్మాత రెండు భారీ చిత్రాలు ఒకేసారి విడుదల చేయడం ఎప్పుడూ జరగలేదు. ఇది ఫస్ట్ టైం జరిగింది. దీనికి కారణం కథలపై మైత్రీ మేకర్స్ కి నమ్మకం. ప్రేక్షకులు రెండు సినిమాలని అదరిస్తారనే నమ్మకం. మైత్రీ మూవీ మేకర్స్ సంక్రాంతి రిలీజ్ చేయబోయే రెండు సినిమాలు వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య పెద్ద విజయాలు సాధించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను'' అన్నారు.

 

అయితే ఇప్పుడు వీరయ్యకి వీరసింహా టీం నుండి బెస్ట్ విశేష్ వచ్చాయి. మాస్ మొగుడు సాంగ్ లాంచ్ ఈవెంట్ లో దర్శకుడు గోపి చంద్ మలినేని వాల్తేరు కు అభినందనలు చెప్పాడు. ''పండక్కి రాబోతున్న రెండు సినిమాలు పెద్ద విజయాలు సాధించాలని మెగాస్టార్ చిరంజీవి గారు మనస్పూర్తిగా కోరుకున్నారు. చిరంజీవి గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. వీరసింహా రెడ్డిలానే వాల్తేరు వీరయ్య పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను. అన్నీ మా సినిమాలే. అన్ని సినిమాలు బావుండాలి. ఈ పండగ నెక్స్ట్ లెవల్ లో వుండాలి’’ అన్నారు. ఈ రెండు సినిమాలు మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.