ENGLISH

టీజర్ టాక్: వినరో భాగ్యము విష్ణుకథ

10 January 2023-12:46 PM

వరుసగా సినిమాలు చేస్తున్నాడు కిరణ్‌ అబ్బవరం. ఆయన నుండి మరో సినిమా రెడీ అయ్యింది. అదే వినరో భాగ్యము విష్ణుకథ. మురళీ కిషోర్‌ అబ్బూరి దర్శకత్వం.కశ్మీరా కథానాయిక. మురళీశర్మ, ఆమని కీలక పాత్రలు పోషిస్తున్నారు. బన్నీ వాసు నిర్మాత. తాజాగా వినరో భాగ్యము విష్ణుకథ టీజర్ వదిలారు.

 

ఈ టీజర్ గురించి చెప్పాలంటే ‘కాన్సెప్ట్‌తో మొదలై.. లవ్వూ, కామెడీ మిక్స్‌ అయి, క్రైమ్‌ నుంచి సస్పెన్స్‌ వైపు సాగే ఇంటెన్స్‌ యాక్షన్‌ డ్రామా’. కాన్సెప్ట్ ఏంటో చెప్పకుండా టీజర్ విడుదల చేసిన తీరు ఆకట్టుకుంటోంది. కిరణ్ అబ్బవరం టైమింగ్ బావుంది. లవ్ యాక్షన్ థ్రిల్ అన్ని ఎలిమెంట్స్ వున్నాయి. మురళీశర్మ, ఆమనిల మధ్య వచ్చే సన్నివేశాలు నవ్వులు పూయిస్తున్నాయి. చివర్లో సామజవరగమనా పాటకి మురళిశర్మ ఫ్లోర్ స్టెప్ హైలెట్ గా నిలిచింది. మొత్తానికి కాన్సెప్ట్ ఏమిటో చెప్పుకుండానే సినిమా వైరేటీగా వుంటుంది ఈ టీజర్ ద్వారా చెప్పారు.