ENGLISH

అక్కడ కూడా బన్నీ డెసిషన్‌ వర్కవుట్‌ కావట్లేదట.!

25 January 2019-12:30 PM

ఓ సినిమా కోసం చాలా చాలా కష్టపడి, ఆ కష్టానికి తగ్గ ఫలితం దక్కకపోతే, ఆ డిప్రెషన్‌ ఎలా ఉంటుందో మాటల్లో చెప్పలేనిది. అలాంటి డిప్రెషన్‌నే బన్నీ 'నా పేరు సూర్య' సినిమాతో అనుభవించాడు. అందులోంచి ఎలాగోలా తేరుకుని, ఈ డైరెక్టర్‌, ఆ డైరెక్టర్‌ అంటూ చివరికి త్రివిక్రమ్‌కి కమిట్‌ అయిపోయిన బన్నీ మూవీ త్వరలో సెట్స్‌ మీదికెళ్లనుంది. ఇదిలా ఉంటే, సహజంగానే తన సినిమాల్లో చిన్నా, చితకా సూచనలు చేసే బన్నీ, ఇక నుండి అలాంటి సాహసాలు చేయకూడదని నిర్ణయించుకున్నాడట. పూర్తి బాధ్యతను డైరెక్టర్‌కే వదిలేయాలని గట్టి డెసిషన్‌ తీసుకున్నాడట. 

 

అలా పూర్తి బాధ్యత ఇప్పుడు త్రివిక్రమ్‌కే వదిలేశాడట. ఎలాగైనా సరే ఈ సినిమాతో హిట్‌ కొట్టి చూపించాలని కసిగా ఉన్నాడు. 'సరైనోడు' తర్వాత సరైన హిట్‌ కొట్టలేదు అల్లు అర్జున్. త్రివిక్రమ్‌తో ఆల్రెడీ 'జులాయి', సన్నాఫ్‌ సత్యమూర్తి' రూపంలో రెండు సూపర్‌ హిట్స్‌ బన్నీ ఖాతాలో ఉన్నాయి. మళ్లీ ఇప్పుడు అలాంటి సూపర్‌ హిట్‌కే త్రివిక్రమ్‌ రంగం సిద్ధం చేస్తున్నాడట. ఇదిలా ఉంటే, ఈ సినిమాలో బన్నీ సరసన చిందేయనున్న ముద్దుగుమ్మ ఎవరనే విషయంలో ఇంకా క్లారిటీకి రాలేదు. 

 

కైరా అద్వానీ పేరు వినిపిస్తున్నా, కైరా ప్రస్తుతం బాలీవుడ్‌లో బిజీగా ఉన్న కారణంగా ఆమె డేట్స్‌ విషయంలో కొంత అయోమయం నెలకొంది. మామూలుగా తన సినిమాలో హీరోయిన్స్‌ని బన్నీనే సెలెక్ట్‌ చేసుకుంటాడు. కానీ ఈ సినిమాకి ఆ విషయంలో కూడా బన్నీ చొరవ చూపించడం లేదనీ తెలుస్తోంది. జనవరిలోనే ఈ సినిమా సెట్స్‌ మీదికి వెళ్తుందని అనౌన్స్‌ చేశారు. కానీ మంత్‌ ఎండింగ్‌ అయినా ఎలాంటి అప్‌డేట్‌ రాలేదు. చూడాలి మరి ఇంకా ఎంత టైం తీసుకుంటాడో మన స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్

ALSO READ: హరీష్‌కి వరుణ్‌ లక్‌ కలిసొస్తుందేమో.!