ENGLISH

గ్లామ్‌ షాట్‌: అందాల ఎమ్మెల్యే - అదిరిందిలే

02 June 2017-16:48 PM

ఎమ్యెల్యే అంటే మై లవ్‌లీ ఏంజిల్‌ అంటూ అల్లు అర్జున్‌కే కాకుండా, తెలుగు ప్రేక్షకులందరికీ ప్రియురాలు అయిపోయింది హాట్‌ బ్యూటీ కేథరీన్‌. ఈ ముద్దుగుమ్మ సినిమాల్లోనే కాకుండా, సోషల్‌ మీడియాలో కూడా తన అంద చందాలతో అభిమానులకు హాట్‌ హాట్‌ దరువులు వేస్తూనే ఉంటుంది. ఇదిగో ఇలా తాజాగా తన అందాన్ని ఇలా హాయిగా పరిచి, కుర్రకారుకు హీట్‌ పుట్టిస్తోంది. వైట్‌ అండ్‌ బ్లూ డ్రస్సులో ఆమ్మడు అలా అందంగా పరుగిడుతుంటే, ఆహా ఎంత అందంగా ఉందో కదా. అమ్మడి గ్లామర్‌ ప్రత్యేకత అదే. ఎలాంటి వారినైనా అలా కొల్లగొట్టేస్తుంది అంతే! కేథరీన్‌ ప్రస్తుతం 'గౌతమ్‌ నందా' సినిమాలో నటిస్తోంది. ఆ సినిమాలోని హాట్‌ స్టిల్లే ఇది. మీరు కూడా ఓ లుక్కేసి హ్యాపీ ఫీలవ్వండి.

 

ALSO READ: Qlik Here For Catherine Tresa Latest Photos