నటీనటులు: విశ్వక్ సేన్, నివేతా పెత్తురాజ్, రావు రమేష్, రోహిణి మొల్లేటి, అజయ్, హైపర్ ఆది, అక్షర గౌడ
దర్శకుడు : విశ్వక్ సేన్
నిర్మాతలు: కరాటే రాజు
సంగీత దర్శకులు: లియోన్ జేమ్స్
సినిమాటోగ్రఫీ: దినేష్ కె బాబు
ఎడిటర్: అన్వర్ అలీ
రేటింగ్ : 2.5/5
విష్వక్ సేన్ సక్సెస్ రేటు ఎక్కువే. ఈ నగరానికి ఏమైయింది సినిమా ఆయనకు యూత్ లో మంచి పేరు తీసుకొచ్చింది. పాగల్ తప్పితే. ఓరి దేవుడా, అర్జున కళ్యాణం సినిమాకు కూడా అలరించాయి. ఆయనలో దర్శకుడు కూడా వున్నాడు. ఫలక్ నామా దాస్ తర్వాత.. ఇప్పుడు ఆయన మళ్ళీ మెగా ఫోన్ పట్టుకొని దాస్ కా ధమ్కీ’ చేశాడు. హీరో, డైరెక్టర్, నిర్మాత ఇలా అన్నీ తానే అయి నడిపాడు. తెర వెనుక త్రిపాత్రభినయం.. తెరముందు ద్విపాత్రభినయం చేసిన విశ్వక్.. ప్రేక్షకులకు ఎలాంటి వినోదాల్ని ఇచ్చాడు ? దర్శకుడిగా మరో సక్సెస్ ఆయన ఖాతో చేరిందా ?
కథ:
కృష్ణదాస్ (విష్వక్ సేన్) ఓ స్టార్ హోటల్‌లో వెయిటర్‌గా పని చేస్తుంటాడు. ఒకరోజు అదే హోటల్‌కు వచ్చిన కీర్తి (నివేదా పేతురాజ్)ని చూసి ప్రేమలో పడతాడు. తాను వెయిటర్ అన్న విషయాన్ని దాచి పెట్టి.. కోటీశ్వరుడిలా నటించడం మొదలుపెడతాడు. కట్ చేస్తే.. అచ్చం కృష్ణ దాస్ పోలికలతో ఉంటాడు సంజయ్ రుద్ర(మరో విశ్వక్ సేన్) తను ఓ ఫార్మా కంపెనీకి అధినేత. ఒక రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోతాడు. ఆ ఫార్మా కంపెనీ నిలబడాలంటే కృష్ణదాస్ సంజయ్ స్థానంలో రావాలి. సంజయ్ కి మామ అయిన సిద్దార్థ్ (రావు రమేష్) కృష్ణ దాస్ ని సంజయ్ స్థానంలోకి తీసుకొస్తాడు. తర్వాత దాస్ కి ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి ? అసలు సంజయ్ ఎలా చనిపోయాడు ? అతని మరణం వెనుక ఎవరున్నారు ? కీర్తి ప్రేమని దాస్ గెలుచుకున్నాడా? లేదా అనేది మిగతా కథ.
విశ్లేషణ :
ఒకేలా కనిపించే ఇద్దరు వ్యక్తుల మధ్య నడిచే కథ ఇది. అయితే ఈ కథ రెండు సినిమాలు చూస్తున్న ఫీలింగ్ ఇస్తుంది. ప్రధమార్ధమంతా కామెడీ కమర్షియల్ ఎలిమెంట్స్ తో నడిస్తే.. రెండో సగం సంజయ్ పాత్ర రూపంలో థ్రిల్లర్ గా మారుతుంది. ఫస్ట్ హాఫ్ లో వెయిటర్‌గా దాస్ జీవితం, కీర్తి తన జీవితంలోకి రావడం.. ఆమెతో ప్రేమలో పడటం. రిచ్ మ్యాన్ గా నటించడం ఇలా రొటీన్ గా సాగుతుంది. ఎక్కడా కొత్తదనం కనిపించదు కోటీశ్వరుడిలా నటించే పాత్రలు ఇది వరకే చాలా చూశాం కాబట్టి ఆ ట్రాక్ చప్పగా వుంటుంది.
ఇంటర్వెల్ బాంగ్ కూడా ఏం గొప్పగా వుండదు. అయితే అప్పటికే కాస్త విసిగిపోయిన ప్రేక్షకుడికి ఎదో థ్రిల్లర్ అనే ఫీలింగ్ అయితే కలిగిస్తుంది. అయితే సంజయ్ స్థానంలోకి కృష్ణ రావడం, దాని వెనుక వున్న మలుపు రివిల్ చేయడం దానికి చూపిం చిన కారణాలు.. తేలిపోతాయి. మలుపులు అనుకున్న వన్నీ ముందుగానే ప్రేక్షకుడి ఊహకు అందిపోతాయి. దీంతో తర్వాత ఏం జరుగుతుందో అనే ఆసక్తి తగ్గిపోతుంది. ఇక ముగింపు కూడా ఊహించినట్లుగానే వుంటుంది. అన్నట్టు దీనికి రెండో పార్ట్ వుందని సెపరేట్ గా ఒక సీక్వెన్స్ నే తీశారు. ఆ సీక్వెన్స్ బావున్నప్పటికీ ఈ కథకు ప్రయోజనం చేకూరలేదు.
నటీనటులు:
డబుల్ యాక్షన్ లో విశ్వక్ ఆకట్టుకున్నాడు. సంజయ్ పాత్ర విశ్వక్ ఇమేజ్ కి కొత్తగా వుంటుంది. యాక్షన్ సీన్స్ లో కూడా ఆకట్టుకున్నాడు. కీర్తి పాత్రలో నివేదా గ్లామరస్ గా కనిపించింది. అయితే నటనకు అవకాశం లేని పాత్రది.
రావు రమేష్‌ది రెగ్యులర్ పాత్ర. హైపర్ ఆది, మహేష్ జస్ట్ ఓకే అనిపిస్తారు. తరుణ్ భాస్కర్ ప్రజన్స్ బావుంది కానీ ఆ పాత్రకు పెద్ద ప్రాధన్యత లేదు. మిగతా నటీనటులు పరిధిమేర కనిపించారు.
టెక్నికల్:
సాంకేతికంగా సినిమా బావుంది. ఆల్ మోస్ట్ పడిపోయిందే పిల్లా పాట హుషారుగా సాగింది. నేపధ్యసంగీతం బావుంది కానీదానికి తగ్గ సీన్స్ పడలేదు.
కెమరాపని తనం డీసెంట్ గా వుంది.దర్శకుడిగా విశ్వక్ సగం మార్కులే పడతాయి. డబుల్ యాక్షన్ ని రక్తికట్టించలేకపోయారు ఇది డైరెక్షన్ లోపమే.
ప్లస్ పాయింట్స్
విశ్వక్ సేన్
కొన్ని నవ్వులు, ఓ మలుపు
మైనస్ పాయిన్స్
కొత్తదనం లేని కథ
మలుపులు తేలిపోవడం
రక్తికట్టని సెకండ్ హాఫ్
ఫైనల్ వర్దిక్ట్: ప్రేక్షకుడికి ధమ్కీ