ENGLISH

‘బి ద రియల్‌ మ్యాన్‌’ - దేవిశ్రీ.. ఆ రూటే సెపరేటు.!

29 April 2020-12:45 PM

రాక్‌ స్టార్‌ దేవి శ్రీ ప్రసాద్‌ కూడా ‘బి ద రియల్‌ మ్యాన్‌’ ఛాలెంజ్‌ని స్వీకరించాడు.. తనదైన స్టయిల్లో.! పొద్దున్నే మేనల్లుడు ‘మామా.. నిద్ర లేవాలి.. వాళ్ళంతా చూడు ఎలా చేస్తున్నారో..’ అంటూ దేవి శ్రీ ప్రసాద్‌ని నిద్ర లేపితే, ఆ తర్వాత మొదలైంది అసలు కథ. ఇల్లు ఊడ్చేశాడు.. వంటింట్లోకి వెళ్ళి కిచెన్‌ కింగ్‌లా మారి ఆమ్లెట్‌ కూడా వేసేశాడు. దేవి శ్రీ ప్రసాద్‌ ప్రముఖ సంగీత దర్శకుడు కదా.. అందుకే బ్యాక్‌ గ్రౌండ్‌లో మాంఛి మ్యూజిక్‌ సెట్‌ చేసుకున్నాడు.

 

చివర్లో ‘నాన్నకు ప్రేమతో..’ అంటూ దేవి శ్రీ ప్రసాద్‌ ఇచ్చిన ఫినిషింగ్‌ టచ్‌.. ఈ మొత్తం వీడియోకి హైలైట్‌గా చెప్పుకోవచ్చు. మొత్తమ్మీద, లాక్‌డౌన్‌ పీరియడ్‌లో సినీ ప్రముఖులు చాలామంది ‘బి ద రియల్‌ మ్యాన్‌..’ అంటూ తమలోని టాలెంట్‌ని కొత్త రకంగా చూపిస్తున్నారన్నమాట. సినీ పరిశ్రమలో ‘చిరంజీవి దోశ’కి వున్న ఫాలోయింగ్‌ ఏంటో అందరికీ తెల్సిందే. ఆ దోశ టాలెంట్‌ని చిరంజీవి ఇన్నాళ్ళకు ఈ లాక్‌డౌన్‌ నేపథ్యంలో చూపించారు. ఉప్మా పెసరట్టు పెనం మీద వేసి, దాన్ని ఎగరేసి తిరగేసిన వైనం.. అద్భుతహ అంతే. ఇక, దేవి శ్రీ ప్రసాద్‌, తన తర్వాత ఈ ఛాలెంజ్‌ని పూర్తి చేయాల్సిందిగా అల్లు అర్జున్‌, హరీష్‌ శంకర్‌ తదితరులకు టాస్క్‌ ఇచ్చాడు.

ALSO READ: ప్రముఖ బాలీవుడ్‌ నటుడు ఇర్ఫాన్‌ ఖాన్‌ మృతి.